Tollywood Producer: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శక నిర్మాతలు, హీరో ,హీరోయిన్లు సినిమాల పట్ల ఆసక్తితో సినిమాలలో నటిస్తూ ఉంటారు. అలాగే నిర్మాతలు కూడా సినిమాలపై ఉన్న ఫ్యాషన్ తోనే సినిమాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది నిర్మాతలు మాత్రం కేవలం రికార్డుల కోసమే సినిమాలు చేస్తూ ఉంటారు. సినిమాలు ఫ్లాప్ అయ్యి నష్టాలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. కేవలం ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించడం కోసమే కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ నిర్మాత కూడా ఇలాంటి పని చేశారని చెప్పాలి.
భీమవరం టాకీస్ నిర్మాణంలో..
ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న తుమ్మలపల్లి సత్యనారాయణ(Thummalapalli Satyanarayana) ఒకేసారి 15 సినిమాలకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది. అయితే ఈ సినిమాలన్నింటినీ నిర్మించి సక్సెస్ అందుకోవడం పక్కన పెడితే, కేవలం రికార్డుల కోసమే ఈ సినిమాలు ఒప్పుకున్నారని స్పష్టమవుతుంది. ఇదివరకే ఈయన భీమవరం టాకీస్(Bheemavaram Talkies) నిర్మాణంలో పలు సినిమాలు చేశారు. శివగామి, ఐస్ క్రీమ్ 2, ధనలక్ష్మి తలుపు తడితే వంటి సినిమాలను నిర్మించారు. అయితే ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ అందులేకపోయింది. ఈయన నిర్మాణంలో సరైన హిట్టు లేకపోయినా ఒకేసారి 15 సినిమాలకు కమిట్ అయ్యారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
యండమూరి దర్శకత్వంలో…
ప్రస్తుతం సత్యనారాయణ నిర్మాతగా హైదరాబాదులోని ఒక స్టూడియోలో ఒకేసారి 15 సినిమాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. నా పేరు పవన్ కళ్యాణ్, అవంతిక2, యండమూరి కథలు, సావాసం, డార్క్ స్టోరీస్, మనల్ని ఎవడ్రా ఆపేది, కెపిహెచ్బీ కాలనీ, జస్టిస్ ధర్మ, నాగ పంచమి, పోలీసు సింహం, బీసీ, హనీ కిడ్స్, ది ఫైనల్ కాల్ , అవతారం వంటి 15 సినిమాలకు ఈయన ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ సినిమాలలో యండమూరి కథలు సినిమాని స్వయంగా యండమూరి వీరేంద్ర(Yendamuri Veerendranath) దర్శకత్వం వహించటం విశేషం.
తేడా కొట్టిందో అంతే సంగతులు…
ఇలా ఒకేసారి 15 సినిమాలకు కమిట్ అవుతూ 15 సినిమాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఒకేసారి ప్రారంభించడం అంటే కచ్చితంగా రికార్డు కోసమే ఇలా సినిమాలకు కమిట్ అయ్యారని తెలుస్తుంది. మరి ఇందులో ఎన్ని సినిమాలు చివరి వరకు షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తాయో తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో సంచలనగా మారడంతో రికార్డుల కోసం ఇలా రిస్క్ చేయడం అవసరమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏమాత్రం తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుందని, పెద్ద ఎత్తున నష్టాలు తప్పవని మరికొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా నందమూరి హీరో తారకరత్న ఒకేసారి 9 సినిమాలకు కమిట్ అయ్యి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అదే బాటలోనే నిర్మాత సత్యనారాయణ కూడా 15 సినిమాలకు కమిట్ అయ్యారు. మరి ఈ 15 సినిమాలలో ఎన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయో తెలియాల్సి ఉంది.
Also Read: Actress Harshitha: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బుల్లితెర నటి… బేబీ ఆన్ ద వే అంటూ!