Chhaava: రష్మిక మందన్న (Rashmika Mandanna).. పుష్ప (Pushpa ) సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర అంటూ వరుస చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మూడు చిత్రాలతో మూడేళ్లలోనే 3వేల కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిన ఈమె కెరియర్లో మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం ఛావా (Chhaava). 2025 ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చారిత్రక యాక్షన్ సినిమాగా విడుదలయ్యింది.
ఛావా సినిమా విశేషాలు..
శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) శంభాజీ మహారాజు పాత్ర పోషించగా.. ఆయన భార్య పాత్రలో రష్మిక ఒదిగిపోయారు. వీరితో పాటు అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్.(Lakshman Utekar) దర్శకత్వం వహించగా.. దినేష్ విజన్.. మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల ఛావా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందించారు.
సైలెంట్ గా టీవీల్లోకి రాబోతున్న ఛావా..
ఇకపోతే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 2025 ఏప్రిల్ 11వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చింది ఈ సినిమా. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సైలెంట్ గా ఈ సినిమా టెలివిజన్ ప్రసారానికి సిద్ధమయ్యింది. 2025 ఆగస్టు 17 అంటే ఈరోజు మరాఠీ, హిందీ భాషలలో స్టార్ గోల్డ్ ఛానల్లో రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. వరల్డ్ టీవీ ప్రీమియర్ షోగా రాబోతున్న ఈ చిత్రం కేవలం హిందీ, మరాఠీ ప్రేక్షకుల కోసం మాత్రమే టీవీలోకి రాబోతుండడంతో మిగతా మూవీ లవర్స్ మాత్రం కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఏదేమైనా సైలెంట్ గా ఈరోజు టీవీలోకి రాబోతుండడంతో అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయాన్ని రష్మిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పంచుకుంది. ఇది చూసిన అభిమానులు టీవీల్లో ఈ సినిమా చూడడానికి సిద్ధమవుతున్నారు.
ఛావా సినిమా కలెక్షన్స్..
ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదలైన ఈ ఛావా సినిమా ఫుల్ ముగిసేసరికి ఎంత రాబట్టింది అనే విషయానికి వస్తే.. రూ.90 నుండి రూ.130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద రూ.797.34 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా పెట్టిన పెట్టుబడికి 7 రెట్లు లాభం రావడంతో అటు నిర్మాతలే కాదు ఈ సినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాభాల బాట పట్టారు. ఇకపోతే ఈ సినిమా హక్కులను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ 2 పై అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు.
Also read: Pawan Kalyan: మీరు మా పెద్దన్న.. స్టార్ హీరోపై పవన్ కళ్యాణ్ ట్వీట్!