BigTV English

Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ

Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ

Weather News: ఆగస్టు నెల మొదటి వారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఇక ఏపీలో గోదావరి జిల్లాల్లో వానలు ఏకధాటిగా కురుస్తున్నాయి. అయితే..  వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చారు.


ఈ జిల్లాల్లో వర్షాలు దంచుడే దంచుడు..

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ భారీ, అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ రోజు కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


రేపు ఈ జిల్లాల్లో కుండపోత వాన కొట్టుడే కొట్టుడు..

రేపు రాష్ట్రంలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు జయశంకర్, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అన్నారు. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొన్నారు. అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ALSO READ: Rahul Gandhi: ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. సీఈసీ ఫైర్

ఏపీలో ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్.. జర్రంతా జాగ్రత్త

ఇక ఏపీలో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లుండి ఒడిశా- ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే అధికారులు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ALSO READ: National Highway: రూ.11వేల కోట్లతో నేషనల్ హైవే.. 20 నిమిషాల్లోనే ఎయిర్ పోర్టుకు..!

కొనసీమ జిల్లాకు అలర్ట్ ప్రకటించిన కలెక్టర్..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేని వర్షం పడుతోంది. కోనసీమ జిల్లా ప్రజలకు కలెక్టర్ అలర్ట్ ప్రకటించారు. మరో రెండు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. రాజమండ్రిలో భారీ వర్షం పడుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద క్రమంగా పెరుగతోంది. మన్యం ప్రాంతంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి.

Related News

Nellore News: ఆస్పత్రిలో ఖైదీ రాసలీలలు.. ఏకంగా హాస్పిటల్ బెడ్ పైనే.. ఏంటీ దారుణం?

RK Roja: వార్-2 సినిమాను అడ్డుకుంటారా..? రోజా సంచలన వ్యాఖ్యలు

Vizag Rainfall: మరో 3 రోజుల వర్షాలు.. విశాఖ వాసులకు టెన్షన్ పెంచుతున్న వాతావరణం!

NTR fans protest: అనంతపురంలో ఉద్రిక్తత.. బహిరంగ క్షమాపణకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!

MLA Daggubati Prasad: ఆ ఆడియో నాది కాదు.. కానీ సారీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే!

Big Stories

×