Kollywood: కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ధనుష్ (Dhanush ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతగా దూసుకుపోతున్న ధనుష్.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’.. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ అంచనాలను రెట్టింపు చేసే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేంటంటే ధనుష్ కి చెల్లెలుగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ నటించబోతుందని సమాచారం. మరి ఆమె ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ధనుష్ కి చెల్లిగా స్టార్ హీరోయిన్..
ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా నిత్యామీనన్ (Nithyamenon) నటిస్తూ ఉండగా.. ఇప్పుడు ధనుష్ కి చెల్లి పాత్రలో షాలిని పాండే (Shalini Pandey) నటిస్తోందని సమాచారం. ఈమెను మేకర్స్ తాజాగా సంప్రదించగా.. ఈమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ విషయం తెలియడంతో ఆరేళ్ల తర్వాత షాలిని ఈ పాత్రతో రీఎంట్రీ ఇస్తోందా అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తున్నా సరే హీరోయిన్ గానే ఎంట్రీ ఇవ్వడానికి చూస్తారు. పైగా షాలిని పాండే లాంటి యంగ్ హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయడానికి అస్సలు ఒప్పుకోరు. అలాంటిది ఈమె చెల్లి పాత్ర చేయడానికి ఒప్పుకోవడంతో అభిమానులు కూడా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే దీనిపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
షాలిని పాండే కెరియర్..
షాలిని పాండే విషయానికి వస్తే.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)!హీరోగా నటించగా.. సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి అందర్నీ అలరించిన ఈమెకు.. మళ్లీ ఈ స్థాయి గుర్తింపు అయితే రాలేదని చెప్పాలి. చివరిగా అనుష్క(Anushka ) నటించిన పాన్ ఇండియా సినిమా ‘నిశ్శబ్దం’ తర్వాత షాలినీ పాండే మరో తెలుగు సినిమాలో నటించలేదు. అలాగే తమిళంలో కూడా కెరియర్ ప్రారంభంలో ‘100% కాదల్ ‘, ‘గొరిల్లా’ వంటి చిత్రాలలో నటించిన ఈమె.. ఆ తర్వాత అక్కడి నుండి అవకాశాలు అందుకోలేదు.. తర్వాత పలు వివాదాస్పద స్టేట్మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలిచిన ఈమె.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కోలీవుడ్లోకి అడుగుపెట్టబోతోంది. అయితే ఈసారి హీరోయిన్ గా కాకుండా చెల్లి పాత్రతో పలకరించబోతోందని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి చెల్లి పాత్రలో చేస్తానంటూ ముందుకొచ్చిన ఈమెను అభిమానులు.. ఈ పాత్రలో యాక్సెప్ట్ చేస్తారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే.
also read: Pawan Kalyan: మీరు మా పెద్దన్న.. స్టార్ హీరోపై పవన్ కళ్యాణ్ ట్వీట్!