Actress Harshitha: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు పెళ్లిళ్ల గురించి అలాగే ప్రెగ్నెన్సీ గురించి పెద్ద ఎత్తున అభిమానులతో శుభవార్తలను పంచుకుంటూ ఉన్నారు. అలాగే బుల్లితెర హీరోయిన్స్ కూడా అమ్మలుగా ప్రమోట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది తమ ప్రేగ్నెన్సీ గురించి శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా మరొక బుల్లితెర నటి హర్షిత వెంకటేష్(Harshitha Venkatesh) సైతం తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. స్టార్ మాలో ప్రసారమైన లక్ష్మీ కళ్యాణం (Lakshmi Kalyanam)అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు హీరోయిన్ గా పరిచయమైన హర్షిత అనంతరం జీ తెలుగు, ఈటీవీ సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు.
ఇస్మార్ట్ జోడి 2 విజేతలుగా…
ఇలా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో కూడా సీరియల్స్ తో పాటు పలుకు బుల్లితెర కార్యక్రమాలలో కూడా నటించి సందడి చేశారు. సీరియల్స్ లో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకొని బిజీగా ఉన్న సమయంలోనే హర్షిత వినయ్ శ్యాంసుందర్(Vinay Shyamsundar) అనే వ్యక్తితో ఏడడుగులు నడిచారు. ఇలా పెళ్లి తర్వాత కూడా ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు పెళ్లి తర్వాత తన భర్త వినయ్ తో కలిసి ఓంకార్ హోస్ట్ గా వహరిస్తున్న ఇస్మార్ట్ జోడి సీజన్ 2(Ismart Jodi 2) కార్యక్రమంలో పాల్గొని సందడి చేయడమే కాకుండా ఈ కార్యక్రమంలో విజేతలుగా కూడా నిలిచారు.
తల్లి కాబోతున్న హర్షిత..
ఇలా తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో కూడా రాజారాణి అనే బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా అక్కడ కూడా విజేతలుగా నిలిచారు. ఇలా ఈ కార్యక్రమం తర్వాత సీరియల్స్ లో పెద్దగా నటించని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. అయితే తాజాగా హర్షిత తనకు సంబంధించిన గుడ్ న్యూస్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించారు.
?igsh=MWZtc3A3bW9tOHM1MA%3D%3D
హర్షిత తన ప్రెగ్నెన్సీ (Pregnancy) స్కాన్ కి సంబంధించిన ఫోటోలను చూపించడమే కాకుండా బేబీ బంప్ (Baby Bump)తో ఉన్న వీడియోని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేశారు. వీరి వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ శుభవార్తను కూడా తెలియజేశారు. త్వరలోనే తమ జీవితాలలోకి మరొక వ్యక్తి రాబోతున్నారంటూ ఈ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకోవడంతో అభిమానులు కూడా ఈ జంటకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Ram Gopal Varma: నాన్న జన్మనిస్తే.. నాగార్జున రెండో జీవితాన్ని ఇచ్చారు.. వర్మ ఎమోషనల్ !