Bejawada Bebakka: సింగర్ మధు నెక్కంటి(Madhoo Nekkanti) అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ బెజవాడ బేబక్క (Bejawada Bebakka) అంటే మాత్రం టక్కున ఈమె అందరికీ గుర్తుకొస్తారు. బేబక్క గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సింగర్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన నూతన గృహప్రవేశానికి(House Warming) సంబంధించిన కొన్ని వీడియోలను షేర్ చేశారు. హైదరాబాదులోని కోకాపేట ప్రాంతంలో ఖరీదైన, సౌకర్యవంతమైన ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.
కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్క..
తాజాగా ఈమె ఈ ఫ్లాట్ లోకి సంప్రదాయబద్ధంగా పూజ కార్యక్రమాలను నిర్వహించి గృహప్రవేశం చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లు, నటుడు శ్రీకాంత్ వంటి తదితరులు హాజరై సందడి చేశారు.. ఇక ఈమె ఇల్లు మాత్రం ఎంతో చూడముచ్చటగా ఉందని చెప్పాలి. ఇక ఈ ఇంటిలో ఈమె తన పిల్లి కోసం ప్రత్యేకంగా ఒక గోడ కూడా కట్టించారని తెలుస్తుంది. పిల్లికి ఆడుకోవడానికి అనుగుణంగా ఈ గోడ నిర్మించారనే విషయాన్ని తెలియచేయడంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
నెరవేరిన సొంత ఇంటి కల..
ఇక సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల.. ఎప్పటినుంచో తాను కూడా ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని కలలు కంటున్నాను ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది అంటూ ఈమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా బేబక్క కొత్త ఇల్లు కొనుగోలు చేశారనే విషయాన్ని తెలియచేయడంతో ఈమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే బేబక్క బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss 8) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె కేవలం వారం రోజులు మాత్రమే హౌస్ లో కొనసాగారు.
?igsh=MWVpeDAybHk4OWhyOQ%3D%3D
వారం రోజులపాటు హౌస్ లో ఉన్న బేబక్క తన మాట తీరుతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే మొదటి వారమే హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈమె అనంతరం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన మాట తీరుతో మరింత ఫేమస్ అయ్యారు. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే ఇదివరకే వివాహం చేసుకున్న బేబక్క కొన్ని కారణాల వల్ల తన భర్తకు దూరంగా ఉంటున్నారు. ఇలా ఒంటరిగా ఉన్న ఈమె తిరిగి రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఏమాత్రం లేనని పలు సందర్భాలలో తెలియజేశారు. ప్రస్తుతం ఈమె కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె స్వస్థలం బెజవాడ అయినప్పటికీ ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటుండేవారు. అమెరికాలో ఉంటూ ఫన్నీ రీల్స్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు బిగ్ బాస్ లో అవకాశం రావడంతో తన ఉద్యోగం కూడా వదులుకొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. బిగ్ బాస్ తర్వాత హైదరాబాదులోనే స్థిర పడుతూ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఒక సొంత ఇంటిని కొనుగోలు చేశారు.
Also Read: Tollywood Producer: ఒకేసారి 15 సినిమాలకు కమిట్ అయిన నిర్మాత.. రికార్డుల కోసం రిస్క్ అవసరమా?