BigTV English

Bio Plastic Bags: ఇక ఆ రైల్వే జోన్ లో ప్లాస్టిక్ కనిపించదు, ఎందుకో తెలుసా?

Bio Plastic Bags: ఇక ఆ రైల్వే జోన్ లో ప్లాస్టిక్ కనిపించదు, ఎందుకో తెలుసా?

Indian Railways: భారతీయ రైల్వే.. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కంపోస్టబుల్ బయో ప్లాస్టిక్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రయాణీకులకు బయోడిగ్రేడబుల్ బ్యాగ్‌లను అందించింది.  ప్యాకేజింగ్ మెటీరియల్‌గా ఉపయోగించే ISO17088-కంప్లైంట్ బయోప్లాస్టిక్‌ ను ఇండియన్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి (IIT-G) డెవలప్ చేసింది. ఈ బ్యాగులను ప్రయాణీకులకు ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) జనరల్ మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ, ప్రొఫెసర్ విమల్ కటియార్ నేతృత్వంలోని IIT-G బృందం ఈ బ్యాగులను ప్రయాణీకులకు అందజేశారు.


NFRలో కంప్లీట్ కంపోస్టబుల్ బయో ప్లాస్టిక్‌ వినియోగం

ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) పూర్తిగా కంపోస్టబుల్ బయో ప్లాస్టిక్‌ ఉపయోగించే జోన్ గా మారింది. దేశంలో పూర్తి స్థాయిలో కంపోస్టబుల్ బయో ప్లాస్టిక్‌ వినియోగించే తొలి రైల్వే జోన్‌గా అవతరించింది. పైలట్ ప్రాజెక్ట్‌ లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బెంగాల్, బీహార్, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌ లోని రైల్వే జోన్ టెర్మినల్స్ నుండి రాకపోకలు కొనసాగించే 25 రైళ్లలో 40,000 బయోప్లాస్టిక్ బ్యాగులను పంపిణీ చేసినట్లు NFR ప్రతినిధి కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు. ఈ ప్రాజెక్ట్  తూర్పున ఉన్న రైల్వే జోన్ NFR రవాణా వ్యవస్థ కోసం గ్రీన్ ఇనిషియేటివ్స్ ను స్వీకరించే లక్ష్యంతో అనుసంధానించబడిందని ఆయన వెల్లడించారు.


NFRరైల్వే జోన్ లో వేగవంతమైన రైల్వే విద్యుదీకరణ, సోలార్ పవర్ ఉత్పత్తి, ఏనుగులు, ఇతర జంతువులను రక్షించడానికి కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వర్షపు నీటి సేకరణ, ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్లు, బయో-టాయిలెట్లు, ఘన వ్యర్థాల కంపోస్టింగ్, ప్లాంటేషన్ లాంటి కీలక ప్రాజెక్టులను చేపట్టింది. కామాఖ్య దగ్గర ఉన్న ఇనోక్యులమ్ జనరేషన్ ప్లాంట్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. వీటిని ఉపయోగించిన బెడ్‌ రోల్ బ్యాగులను కొత్త వాటిగా తిరిగి ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుందన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని మరింత తగ్గిస్తుందని  శర్మ వెల్లడించారు. IIT గౌహతితో సహకారం పర్యావరణానికి మేలు కలిగే కంపోస్టబుల్ బయో ప్లాస్టిక్‌ బ్యాగులను రూపొందించింది.  ప్రయాణీకులు కాలుష్యకారక ప్లాస్టిక్ వినియోగానికి బదులుగా ఈ బయో ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగించేలా ప్రోత్సహించనున్నట్లు NFR అధికారులు తెలిపారు.

ఇంతకీ ఏంటి కంపోస్టబుల్ బయో-ప్లాస్టిక్‌?  

కంపోస్టబుల్ బయో ప్లాస్టిక్‌ అనేది సూక్ష్మజీవుల ద్వారా కుళ్ళిపోయేలా రూపొందించబడిన ప్లాస్టిక్‌. ఇవి పారిశ్రామిక కంపోస్టింగ్ సౌకర్యాలలో కుళ్ళిపోయేలా తయారు చేశారు. ఇవి ప్రత్యేక పరిస్థితులలో కుళ్ళిపోయేలా తయారు చేసే ఒక రకమైన బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్‌ సూక్ష్మజీవుల చర్య ద్వారా కుళ్ళిపోతాయి, కానీ కంపోస్టబుల్ ప్లాస్టిక్‌లు ప్రత్యేకంగా పారిశ్రామిక కంపోస్టింగ్ పరిస్థితులలో కుళ్ళిపోతాయి. కంపోస్టబుల్ ప్లాస్టిక్‌లు కుళ్ళిపోయి, నీరు, కార్బన్ డయాక్సైడ్, బయోమాస్‌గా మారతాయి. ఇది సహజ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. కంపోస్టబుల్ బయో ప్లాస్టిక్‌ పర్యావరణానికి మేలు కలిగించేలా ఉంటాయి. ఎందుకంటే ఇవి భూమిలో కుళ్ళిపోయి, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను తగ్గిస్తాయి. కంపోస్టబుల్ ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్, డిస్పోజబుల్ ప్లేట్లు, కప్పులు, ఇతర వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు.

Read Also:  తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

Related News

Indian Railways Ticket: ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Tirupati Special Trains: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

Train Derailed: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు, ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Tirumala crowd: తిరుమలలో భక్తుల వెల్లువ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలకుపైగానే.. టీటీడీ ప్రకటన ఇదే!

Confirmed Railway Ticket: కన్ఫార్మ్ టికెట్ పక్కా.. సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Big Stories

×