Ram Gopal Varma: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలను చేస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో వర్మ ఒకరు. ఇటీవల కాలంలో రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఒకానొక సమయంలో వర్మ సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభించేది. ఎంతో మంది స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన ఘనత వర్మకు ఉంది. అయితే ఇటీవల కాలంలో రాంగోపాల్ వర్మ సినిమాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ తగ్గించారని తెలుస్తోంది. ఇక ఈయన సినిమాలు చేసిన వివాదాలలోనే నిలుస్తున్నాయి.
రీ రిలీజ్ కు సిద్ధమైన శివ..
ఇలా సినిమాలను తగ్గించిన వర్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సినిమా రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. తాజాగా రాంగోపాల్ వర్మ నాగార్జున(Nagarjuna) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున శివ సినిమా (Shiva Movie)చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఈ సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో వర్మ శివ సినిమా సంగతులను అభిమానులతో పంచుకున్నారు.
నన్ను నమ్మి నాతో సినిమా చేశారు..
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించి 50 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే వర్మ మాట్లాడుతూ.. మా నాన్న నాకు జన్మనిస్తే నాగార్జున గారు నాకు రెండో జీవితాన్ని (Second Life)ఇచ్చారని తెలిపారు. నాగార్జున నన్ను నమ్మి నాతో శివ సినిమా చేశారు. ఈ సినిమా సమయంలో సమ్మె కారణంగా షూటింగ్ పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి ఆడియో పనులు కూడా పూర్తి కాలేదు. ఆడియో పనులు ముంబైలో పూర్తి చేయాల్సి ఉంది. ఆ సమయంలో నాగార్జున గారు నాకు ఇవ్వాల్సిన పారితోషికం తగ్గిన పర్వాలేదు కానీ సినిమా పనులు మాత్రం ఆగకూడదని చెప్పినట్లు వర్మ గుర్తు చేసుకున్నారు.
ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన శివ…
తనపై నాగార్జున గారికి ఉన్న నమ్మకం అదేనని, ఆ నమ్మకం కారణంగానే అన్ని సాధ్యమయ్యాయని, ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుందని వర్మ శివ సినిమా సంగతులను గుర్తు చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాల వేడుక పూర్తి కాగానే ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా అమల(Amala) హీరోయిన్ గా నటించారు. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని చెప్పాలి. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇటు నాగార్జున కెరియర్లో ఎన్నో అవకాశాలను అందుకున్నారు. దర్శకుడిగా రాంగోపాల్ వర్మ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో వర్మ ఈ తరహా సినిమాలను పూర్తిగా పక్కన పెట్టారని చెప్పాలి.
Also Read: Malaika Arora: 51 ఏళ్ల వయసులో రెండో పెళ్లి… నేను రొమాంటిక్ అంటున్న నటి!