
Sejal on Durgam Chinnaiah latest news(Telangana news updates):
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా శేజల్ చేపట్టిన ప్రచారానికి విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అండగా నిలిచాయి. అయితే.. శేజల్ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు శేజల్‌ను అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇక బీజేపీ నేత కోడి రమేష్ ఇంటి ముందు బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే దుర్గంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా అమ్మాయికి సపోర్ట్ చేస్తూ.. శిఖండి రాజకీయాలు చేస్తున్నారంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.
ఆదిలాబాద్ జిల్లాలో చిన్నయ్మ ఓటమికి కౌంట్‌డౌన్ మొదలైందంటూ ఫైర్ అయింది ఎమ్మెల్యే చిన్నయ్య బాధితురాలు శేజల్. తాను ఏ తప్ప చేయలేదు కాబట్టే సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
చిన్నయ్యకు వ్యతిరేకంగా బెల్లంపల్లిలో గడపగడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన శేజల్.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనను లైంగిక వేధించడమే కాకుండా నమ్మకం ద్రోహం చేసి, అక్రమ కేసులు పెట్టించి రిమాండ్‌కు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కామ పిశాచి, భూబకాసురుడు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ చిన్నయ్యకు ఓటే వేయొద్దంటూ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు శేజల్.