మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రిలో డబ్బులు ఇవ్వాలంటూ ఆసుపత్రి సిబ్బంది వేధిస్తున్నారని ఓ బాలింత భర్త ఆరోపించారు. వేధింపులు తట్టుకోలేక కొంత డబ్బు ఇచ్చానని తెలిపారు. అయినా సరే ఇంకా కావాలని ఆసుపత్రి సిబ్బంది తనపై ఒత్తిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలింత భర్త మనస్థాపానికి గురై.. ఆసుపత్రి భవనం ఎక్కాడు. కిందకు దూకుతానని బెదిరించాడు. మంగళవారం రాత్రి జనరల్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రికి చేరుకున్నారు. బాలింత భర్త కళ్యాణ్‌కు సర్ధిచెప్పారు. భవనం కిందకు తనను దించారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో డబ్బులు కోసం వేధిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు.