మంచిర్యాల జిల్లాలో ఎద్దు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీలోని అట్టెం మధు అనే వ్యక్తి ఎద్దు కత్తరసాల గ్రామంలోని పంట మేసింది. ఆ పొలంగల రైతు సర్ధార్ ఎద్దుని నిర్భందించాడు.
ఎద్దును సర్ధార్ నిర్బందించడాన్ని మధు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ఎద్దును నిర్భందించారని మధు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో సర్ధార్ ఆ ఎద్దును పోలీసులకు అప్పగించాడు. ఎద్దును బంధించిన రైతుపై చర్యలు తీసుకోవాలని మధు డిమాండ్ చేశాడు. ఇలా ఎద్దు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది.