E-Paper
Advertisement

Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై యువకుడి హత్య

Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై యువకుడి హత్య
Advertisement

Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై హత్య. అదీ.. అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు కొడవళ్లు, కత్తులతో కిరాతకంగా నరికేశారు. ఇదేదో సినిమాకు సంబంధించిన కథ కాదు. ఆదిలాబాద్‌లో జరిగిన ఘటన ఇది.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉదయం 10 గంటల సమయంలో దారుణ హత్య జరిగింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ఈశ్వర్ అనే వ్యక్తిని.. ఇద్దరు దుండగులు.. కొడవళ్లు, కత్తులతో కిరాతకంగా నరికి చంపేశారు. హత్య చేసినంతరం స్థానిక పోలిస్ స్టేషన్‌లో ఇద్దరు నిందితులూ లొంగిపోయారు. హత్య చేసిన ప్రదేశంలో సీసీ కెమెరా ఉండటంతో వీడియో రికార్డు అయ్యింది.

Advertisement

హత్యకు గురైన యువకుడిని ఈశ్వర్ గా గుర్తించారు. మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటాడని స్థానికులు తెలిపారు. హత్యకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×