BigTV English

CM Revanthreddy : ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. గంటసేపు చర్చలు..

CM Revanthreddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సీఎం ప్రధానిని కలవడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర విభజన హామీల గురించి చర్చించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థతి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం నుంచి రావాల్సిన వాటాపై చర్చించారు. అదే విధంగా పాలమూరు – డిండి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం ప్రధాని మోదీని విన్నవించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రధాని మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరామని భట్టి తెలిపారు.

బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాట్లు చేయాలని ప్రధానిని విన్నవించినట్లు చెప్పారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వాలని, ఐటీఐఆర్‌ ప్రాజెక్టులు ఇవ్వాలని ప్రధాని మోడీని విజ్జప్తి చేసినట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×