BigTV English

Suicide: ల్యాండ్ డీల్‌లో సీఐ టార్చర్.. బాధితుడు సూసైడ్..

Suicide: ల్యాండ్ డీల్‌లో సీఐ టార్చర్.. బాధితుడు సూసైడ్..
suicide

Suicide: ల్యాండ్ డీల్‌లో నష్టమొచ్చింది.. నువ్వే చెల్లించాలంటూ ఒత్తిడి తేవడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నంలో బొడిగే శ్యామ్ అలియాస్ సాంబయ్య సూసైడ్ తీవ్ర కలకలం రేపుతోంది. తన చావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సిఐ గోపీ కారణం అంటూ నోట్ రాసిపెట్టాడు.


భూపాలపట్నంలో 20 గుంటలు భూమిని ఇంటలిజెన్స్ సిఐ గోపీకి అమ్మించాడు శ్యామ్ గౌడ్ అలియాస్ సాంబయ్య. ఆ 20 గుంటల భూమిని 50 లక్షలకు కొన్నాడు సదరు సిఐ. దానిపై 10 లక్షలు లాభం వస్తుందని ఆ సమయంలో శ్యామ్ చెప్పాడు. అయితే, రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గిపోవడంతో ప్లాట్లు అమ్ముడుపోలేదు. దీంతో.. తనకు వస్తుందని చెప్పిన పది లక్షల లాభం నువ్వే చెల్లించాలంటూ సదరు సీఐ వేధించినట్టు శ్యామ్ తన డైరీలో రాశాడు. ఇప్పటికే ఆరు లక్షలు చెల్లించానని.. మిగతా నాలుగు లక్షల కోసం వేధిస్తున్నాడంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడంటూ.. కొన్ని ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేశాడు శ్యామ్. నువ్వు చస్తే నీ భార్యా బిడ్డలు బిచ్చమెత్తుకుంటారు తప్ప.. నాకేంటి అంటూ ఆ ఆడియోలో అవతలి వ్యక్తి మాట్లాడాడు. నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటా.. నా భూమిని అమ్ముకుంటా అంటూ నిర్దాక్షిణ్యంగా మాట్లాడాడు. నువ్వు చస్తానంటే నేను సహకరిస్తానంటూ చెప్పడంతో మనస్తాపం చెందిన శ్యామ్.. ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.


Related News

Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ

puppy Adoption: శునకాల దత్తతకు మీరు సిద్ధమా? అయితే ఇక్కడికి వెళ్లండి!

Heavy rains alert: తెలంగాణను దంచికొట్టబోతున్న భారీ వర్షాలు.. 24 గంటల హెచ్చరిక!

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేత

Medak floods: గర్భగుడి వరకు చేరిన వరద నీరు.. మూసివేతలో తెలంగాణలోని ప్రధాన ఆలయం!

Heavy rains: రాష్ట్రంలో కుండపోత వానలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

Big Stories

×