BigTV English

Nischit Bhavishya : నిశ్చిత్‌ భవిష్య పాలసీ, డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ గురించి విన్నారా… బెనిఫిట్స్ చూడండి.

Nischit Bhavishya : నిశ్చిత్‌ భవిష్య పాలసీ, డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ గురించి విన్నారా… బెనిఫిట్స్ చూడండి.

Nischit Bhavishya : రిలయన్స్‌ నిప్పాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఓ పాలసీ రిలీజ్ చేసింది.  నిశ్చిత్‌ భవిష్య పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీలో.. పొదుపు చేసుకునే అవకాశంతో పాటు ఇన్సరెన్స్ కూడా ఉంటుంది. మంచి రాబడికి కూడా హామీ ఇస్తోంది ఫండ్ హౌస్. ఇది నాన్‌ లింక్డ్‌, నాన్‌-పార్టిసిపేటింగ్‌, పర్సనల్ సేవింగ్స్ పాలసీ అని రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సరెన్స్ కంపెనీ చెబుతోంది.


ఈ పాలసీలో రెండు వేరియంట్స్ ఉన్నాయి. వేరియంట్‌-1 ప్రకారం ప్రీమియం చెల్లింపు వ్యవధి పూర్తైన తరువాత.. సాధారణ ఆదాయాన్ని అందిస్తుంది. పదవీ విరమణ, పిల్లల చదువులు, వివాహంలాంటి కీలకమైన అవసరాల కోసం దీన్ని ఎంచుకోవచ్చు. ఇక వేరియంట్‌-2 మనీ బ్యాక్‌ తరహాలో పనిచేస్తుంది. పాలసీ 12 ఏళ్లు పూర్తయ్యాక 4, 8 ఏట చెల్లింపులు ఉంటాయి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ టార్గెట్‌గా ఈ పాలసీని రూపొందించారు. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, వ్యాపారులకు ఈ పాలసీ అనుకూలంగా ఉంటుందని రిలయన్స్‌ నిప్పాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చెబుతోంది.

ఒకవేళ పాలసీ హోల్డర్ చనిపోతే ఏడాది ప్రీమియానికి 11 నుంచి 37 రెట్ల వరకు పరిహారం అందిస్తుంది. 5 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.


డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ కూడా గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఎన్‌ఎఫ్‌ఓ తీసుకొచ్చింది. ఈ ఫండ్ క్లోజింగ్ డేట్.. ఏప్రిల్ 24. మార్కెట్లో బంగారం అందించే రాబడికి దాదాపు సరిసమానంగా ప్రతిఫలాన్ని అందించే వ్యూహంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది కంపెనీ. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ స్కీమ్. ఇందులో కనీస పెట్టుబడిగా రూ.5,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. మున్ముందు బంగారం ధరలు మరింత పెరుగుతాయి. ఈ నేపథ్యంలో పసిడిలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు. అలాంటి వారికి డీఎస్‌పీ గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఎన్‌ఎఫ్‌ఓ బెస్ట్ ఆప్షన్. 

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×