E-Paper
Advertisement

Hyderabad: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్.. మళ్లీ ఏం జరిగింది?

Hyderabad: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్  మన్నె క్రిశాంక్ అరెస్ట్.. మళ్లీ ఏం జరిగింది?
Advertisement

Hyderabad: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి మారేడ్‌పల్లిలో ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు, విషయం చెప్పి అదుపులోకి తీసుకున్నారు. మంత్రి సీతక్కపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు.

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్

Advertisement

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను రాత్రి కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో విషయాలను వివరించారు. ఆ తర్వాత వాహనంలో ఆయన్ని స్టేషన్‌కు తరలించారు. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్టు తెలుస్తోంది.

దానిపై వచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు. కొన్నిరోజులుగా అంగన్‌వాడీలకు పంపిణీ చేస్తున్న మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వరుస పోస్టులు పెట్టాడు క్రిశాంక్. మంత్రిని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన పోస్టులపై తీవ్ర కలకలం రేగింది. దీనిపై అధికారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

Advertisement

మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారం.. రంగంలోకి దిగిన పోలీసులు

ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క మద్దతుదారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పథకాలను తప్పుదోవ పట్టించేలా, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇదిలావుండగా క్రిశాంక్ అరెస్టు విషయం తెలియగానే బీఆర్ఎస్ రియాక్ట్ అయ్యింది. ఆయన అరెస్టుని ఆ పార్టీ నేతలు ఖండించారు.

పూర్తిగా రాజకీయ ప్రేరేపిత అరెస్టు అని చెబుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. క్రిశాంక్‌ను విచారిస్తున్నట్లు పోలీసులు, కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.

ALSO READ: కాళేశ్వరం జోష్.. కాంగ్రెస్ టార్గెట్‌గా బీఆర్ఎస్ కొత్త ఎత్తులు?

 

Related News

22A మహా కుంభకోణం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీశ్‌రావు తీవ్ర విమర్శలు!

బీఆర్ఎస్‌పై ఫ్లాష్ సర్వేలో ఏం తేలింది?.. సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

2027 జనగణనలో బీసీ లెక్కలు ఏవి? కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్!

PM విశ్వకర్మ నుండి UPI వరకు.. మోదీ 25 ఏళ్ల పాలనపై బీజేపీ మాస్టర్ ప్లాన్!

యువతీయువకుడి వీరంగం.. బంజారాహిల్స్‌లో కారుతో బీభత్సం, పోలీసుల అదుపులో

ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో దారుణం.. కత్తులతో దాడి చేసి చంపేసి, సీసీటీవీ సాక్షిగా..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

Big Stories

Advertisement
×