E-Paper
Advertisement

Anasuya Bhardwaj: అనారోగ్యానికి గురైన అనసూయ.. కన్నీళ్లాగలేదంటూఎమోషనల్!

Anasuya Bhardwaj: అనారోగ్యానికి గురైన అనసూయ.. కన్నీళ్లాగలేదంటూఎమోషనల్!
Advertisement

Anasuya Bhardwaj: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న అనసూయ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పలు సినిమాలలో నటిగా కొనసాగుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.  అనసూయ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇతర అంశాల గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా మాట్లాడే అనసూయ తన చేసిన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

బలహీన క్షణాలు..

ఇటీవల శివాజీ మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలపై అనసూయ ఎలా స్పందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో అనసూయ ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంది. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ అనసూయ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈమె తన సమస్యను తెలియజేస్తూ.. నిన్న జరిగిన లైవ్ ,ప్రెస్ మీట్, జూమ్ ద్వారా నేను మాట్లాడాను ఆ సమయంలో నాకు లభించిన మద్దతు నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేసింది అదే సమయంలో కొంత కాలంగా నేను శారీరకంగా అనారోగ్యంతో బాధపడటంతో ఆ బలహీనత క్షణంలో నా కన్నీళ్లు ఆగలేదు. ఇది మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను.. ప్రస్తుతం నేను పూర్తిగా బాగున్నాను.

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను..

Advertisement

మన స్వయం నిర్ణయానికి మద్దతుగా మాట్లాడినందుకు నేను గాని, ఏ మహిళా కానీ ఈ విధమైనటువంటి భయంకర పరిస్థితులను ఎదుర్కోవడం చాలా బాధాకరం . అదే సమయంలో నా వెనుక నిలబడి నాకు ఎంతోమంది మద్దతు తెలియజేశారు. మనమంతా మనుషులమేనని మనిషిగా భావోద్వేగానికి లోనవ్వడంలో నాకు ఎలాంటి సిగ్గు లేదు .. నేను ఎలాంటి పరిస్థితులలోనైనా బూడిద నుంచి మళ్లీ లేచి అన్ని అడ్డంకులను ఎదుర్కొని నిలబడతాను.  బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని లాభం పొందాలని చూస్తారో అది వారి స్వభావాన్ని మాత్రమే చూపిస్తుందని తెలిపారు.

Advertisement

ఇక నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో నేను అక్కడ లేకపోయినా ఎంతో ధైర్యం ఐక్యతతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ అనసూయ తెలియచేశారు. ఇకపోతే నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే అది నేరుగా నా అధికారిక సోషల్ మీడియా ద్వారా మాత్రమే చెబుతానని అంతవరకు నేను మౌనంగా ఉంటానని, మనమంతా శాంతి, సానుభూతి, మానవత్వాన్ని ఎంచుకుందాం అంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనసూయ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Also Read: Anaganaga Oka Raju Public Talk: అనగనగా ఒక రాజు పబ్లిక్ టాక్.. రాజుగారు హిట్ కొట్టినట్టేనా?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×