BigTV English

Minister: యువతికి మంత్రి పేషీ ఉద్యోగి వేధింపులు.. ఆడియో వైరల్

Minister: యువతికి మంత్రి పేషీ ఉద్యోగి వేధింపులు.. ఆడియో వైరల్
audio call

Minister: తెలంగాణలో మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో పనిచేస్తున్న ఉద్యోగి నిర్వాకం బయటపడింది.


మంత్రి సిఫారసుతో ఓ యువతికి సీటు ఇప్పించారు. అదే అలుసుగా తీసుకుని.. మంత్రి పేషీలోని అధికారి.. ఆ యువతిని వేధించడం స్టార్ట్ చేశారు. అసభ్యంగా చాటింగ్ చేస్తున్నాడు. నీ వయసు ఎంత? కలవాలి.. మాట్లాడాలి.. అంటూ మంత్రి పేషీ ఉద్యోగి వేధించాడు.

విషయాన్ని తన సమీప బంధువుకు చెప్పింది ఆ క్రీడాకారిణి. దీంతో అతను నేరుగా ఆ ఉద్యోగికే ఫోన్ చేసి గట్టిగా మాట్లాడాడు. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మొదట ఏ మెసేజ్.. ఏమో అంటూ ఆ ఉద్యోగి బుకాయించే ప్రయత్నం చేశాడు. యువతి బంధువు గట్టిగా నిలదీసి మంత్రికి చెబుతానని బెదిరించడంతో.. కాళ్ల బేరానికి వచ్చాడు. సారీ..సారీ.. ఎవరికీ చెప్పొద్దు అంటూ రిక్వెస్టు చేశాడు.

ఆ యువతితోనే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు క్రీడాకారిణిలనూ ఆ ఉద్యోగి అలానే వేధిస్తున్నాడని తెలుస్తోంది. ఇలా మంత్రి దగ్గర ఉండే అధికారులే కీచకులుగా మారి క్రీడాకారిణిలను వేధించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×