BigTV English

Tirupati: ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి కలకలం.. విద్యార్థుల్లో భయం భయం..

Tirupati: ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి కలకలం.. విద్యార్థుల్లో భయం భయం..
Leopard

Tirupati: తిరుమల కాలిబాటలో చిరుతపులి కలకలం రేపుతోంది. ఇటీవల ఓ బాలుడిపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లగా.. తాజాగా ఓ చిన్నారిని చంపేయడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. టీటీడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి.. నడకమార్గంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. అంతా అటువైపు ఫోకస్ చేస్తే.. సడెన్‌గా తిరుపతిలో ప్రత్యక్షమైంది చిరుతపులి.


అవును, తిరుపతి ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో సోమవారం రాత్రి చిరుత చనిపించింది. విద్యార్థులు గ్రౌండ్‌లో సరదాగా గడుపుతుంటే.. వారికి కాస్త దూరం నుంచి చిరుతపులి దర్జాగా నడుచుకుంటూ వెళ్లింది.

చిరుతను చూడగానే స్టూడెంట్స్ అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. కొందరు ధైర్యం చేసి సెల్‌ఫోన్లో వీడియో తీశారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.


రాత్రి వేళలో కాలేజ్ గ్రౌండ్‌లో చిరుతపులి కనిపించిందనే మేటర్ విని స్టూడెంట్స్ అంతా భయంతో హడలిపోతున్నారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులు ఎప్పుడు ఎటునుంచి చిరుత దాడి చేస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో ఉండే ప్రజలు సైతం చిరుత విషయం తెలిసి.. హైరానా పడుతున్నారు.

వామ్మో.. ఇప్పటికే తిరుమల కాలిబాటలో ఓ చిన్నారిని చంపేసింది.. ఆ చిరుతను పట్టేసుకున్నా.. ఇప్పుడు ఇంకో చిరుతపులి జనారన్యంలోకి వచ్చిందని తెలీగానే.. ఎప్పుడేం జరుగుతుందోనని భయపడిపోతున్నారు స్థానికులు. అసలే రాత్రి సమయం కావడంతో.. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయంతో చచ్చిపోతున్నారు. అధికారులు సాధ్యమైనంత త్వరగా ఆ చిరుతను బంధించాలని వేడుకుంటున్నారు.

Related News

Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

AP Assembly: సొంత అజెండాతో బొత్స.. జగన్‌ను అవమానిస్తున్నాడా?

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ శుభవార్త.. ఆ శ్రమ తగ్గినట్టే, ఇంటి నుంచే ఇకపై

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

Big Stories

×