E-Paper
Advertisement

Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు.. రంగంలోకి సిట్, వారంతా బుక్కయినట్టే

Moinabad Drugs Case: మొయినాబాద్  డ్రగ్స్ కేసు కొత్త మలుపు.. రంగంలోకి సిట్, వారంతా బుక్కయినట్టే

Moinabad Drugs Case: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో చాలామంది ప్రముఖులు ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

మొయినాబాద్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు

తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన రేపిన కేసుల్లో మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు ఒకటి. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మూలాలు ఛేదించేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని-(సిట్) ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ ఆధ్వర్యంలో సిట్ విచారణ మొదలు పెట్టనుంది.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఈ పార్టీకి సంబంధించి లోతైన విచారణ చేపట్టనుంది సిట్. ఆ పార్టీకి ఎంతమంది హాజరయ్యారు? ఎవరెవరు వచ్చారు? డ్రగ్స్ తీసుకొచ్చిందెవరు? ఈ పార్టీ వెనుక అసలు కథేంటి? అనే కోణాల్లో విచారణ సాగనుంది. ఈ కేసులో సిట్ రంగంలోకి దిగిన విషయం తెలియగానే పట్టుబడినవారికి కొత్త టెన్షన్ మొదలైంది.

సిట్ ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన డీజీపీ

ఈ కేసులో దుబాయ్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీయనుంది స్పెషల్ విచారణ టీమ్. ప్రధాన నిందితుడిగా ఉన్న నమిత్ శర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కార్యకలాపాల ద్వారా మనీని ఎలా మళ్లించారనే దానిపై ఫోకస్ చేయనుంది. ఆయన అక్రమ సంపాదనకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టనుంది. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో త్వరలోనే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.

ఈ కేసులో కొంతమంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్‌తోపాటు మద్యం పార్టీ జరిగినట్లు ప్రస్తావించారు పోలీసులు. పార్టీకి హాజరైనవారు మద్యంతోపాటు డ్రగ్స్ తీసుకున్నట్లు విచారణలో అంగీకరించినట్టు ప్రస్తావించారు.

ALSO READ: రబీలో 90 లక్షల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

అందులో పట్టుబడినవారికి రెండోసారి పరీక్షలు చేసిన తర్వాత ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు పేర్కొన్నారు. ఇక నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు బయటపడింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలు కొకైన్ తీసుకున్నట్లు రిపోర్టులో వెల్లడైంది. ఈ కేసులో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌ వచ్చినట్టు వెల్లడించారు. మరి సిట్ విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో?

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×