E-Paper
Advertisement

Uttam Kumar Reddy: రబీలో 90 లక్షల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: రబీలో 90 లక్షల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Advertisement

Uttam Kumar Reddy: స్వేచ్ఛ బ్యూరో: ఈ రబీలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రబీ లో 54.48 లక్షల ఎకరాల్లో 152.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ,కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన తదితర ఏర్పాట్ల పై బేగంపేట లోని ఐఏఎస్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారులు, ఆయా జిల్లాల సివిల్ సప్లయ్స్ మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2025-26 రబీతో ఉత్పత్తి అయిన ధాన్యం దిగుబడిలో వ్యవసాయ రంగ చరిత్రలోనే ముందెన్నడూ లేని తీరులో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకై సమగ్రమైన కార్యాచరణను రూపొందించామన్నారు. అందులో 60 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం,30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నాలు ఉంటాయన్నారు. ధాన్యం కొనుగోలులో రైతాంగానికి ఎక్కడా అవాంతరాలు ఎదురు కాకుండా ఉండేందుకు ధాన్యం ఉత్పత్తికి తగినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో పెరిగిన ధాన్యం

దానికి తోడు కొనుగోలు కేంద్రాలలో ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెనున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రప్రభుత్వం నిర్ణయానుసారంగా మద్ధతు ధర చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గ్రేడ్-ఏ,సాదారణ విభాగాలుగా గుర్తించి గ్రేడ్-ఏ కూ2,389,సాధారణ వరికి 2,369 చెల్లించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా పెరిగిన మద్ధతు ధరతో రైతాంగానికి పెద్ద ఎత్తున లబ్ది చేకూరుతుందని, తద్వారా రైతాంగానికి ఆదాయం పెరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాలను పెంచడంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Also Read: Assembly Security: అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ పై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్..!

వేసవి తీవ్రత..

కొనుగోలు కేంద్రాలలో టార్భాలిన్ షీట్లు,ఎలక్ట్రానిక్ తుకాలు,తేమను కొలిచే పరికరాలు, ఆటోమేటిక్ వరి క్లినర్లు,డిజిటల్ డయల్ కాలిపర్స్, హస్క్ రిమువర్ల తో పాటు సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు సత్వరం ధాన్యాన్ని సరఫరా చేసేందుకు గాను సరిపడా వాహనాల ఏర్పాట్లను ముందుగానే చేయాలని అధికారులను ఆదేశించారు. దానికి తోడు వేసవి తీవ్రత ను దృష్టిలో పెట్టుకుని రైతాంగానికి ఎక్కడ ఇబ్బందులు ఎదురు కాకుండా చూడడంతో పాటు ఎండ వేడిమికి వడ దెబ్బ తగలకుండా నివారణ చర్యల నిమిత్తం తక్షణ ఉపశమనం కోసం ఓ.ఆర్.ఎస్ వంటివి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

Advertisement

Also Read: Biopic Movie OTT: అనంత సముద్రంలో అదిరిపోయే సాహసం… 16 ఏళ్ల అమ్మాయి ఏడు నెలలు ఒంటరిగా…

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×