E-Paper
Advertisement

Muncipolls : మున్సిపల్ ఎలక్షన్స్.. రాజకీయ పార్టీలు ఇలా చేస్తే అంతే సంగతులు!

Muncipolls : మున్సిపల్ ఎలక్షన్స్.. రాజకీయ పార్టీలు ఇలా చేస్తే అంతే సంగతులు!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. నిన్న సాయంత్రం నోటిఫికేషన్ విడుదలవ్వగా.. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నడుము తీవ్ర పోటీ నెలకొన్నది. ఎవరికి వారు ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీలకు కొత్త టెన్షన్ నెలకొన్నది. ఇప్పుడు ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అభ్యర్థులు తమ నామినేషన్లు సైతం కోల్పోయే చాన్స్ ఉన్నది. అందుకే వారంతా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.

కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి?

కోడ్ అమల్లోకి రాగానే అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరూ రూల్స్ ఫాలో కావాల్సిందే.. లేదంటే వారిపై ఈసీ వేటు వేసే చాన్స్ ఉన్నది. ముందుగా చట్టబద్ధంగా ప్రచారం నిర్వహించాలి. ప్రచారానికి నిర్ణయించిన సమయం, స్థలం, శబ్ద పరిమితులు పాటించాలి. సభలు, ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలి. అంతేకాకుండా మర్యాదపూర్వక రాజకీయాలు చేయాలి. ప్రత్యర్థి పార్టీలపై వ్యక్తిగత దూషణలు చేయకూడదు. మతం, కులం, భాష ఆధారంగా ఓట్లు అడగకూడదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు తటస్థంగా ఉండాలి. ఎన్నికల విధుల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాలు మాత్రమే పాటించాలి. ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తే వారి ఉద్యోగానికి ఎసరు వచ్చే అవకాశం ఉన్నది.పోలీసులు సైతం ఈసీ ఆదేశాలను మాత్రమే పాటించాలి. మిగతా కలెక్టర్లు, ఐపీఎస్‌లు సైతం ఈసీ ఆదేశాలనే ఫాలో అవ్వాలి.

ఏం చేయకూడదు..

ఎన్నికల పోటీ చేస్తున్న అభ్యర్థులు ముందుగా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ వనరుల దుర్వినియోగం చేయరాదు.ప్రభుత్వ వాహనాలు, భవనాలు, నిధులు ఎన్నికల కోసం వాడకూడదు. అధికారంలో ఉన్నవారు కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదు. అదేవిధంగా ఓటర్లను ప్రభావితం చేయడం.. డబ్బు, మద్యం, బహుమతులు, వస్తువులు పంచకూడదు. ఉచిత హామీలు ప్రకటించి ఓట్లు కొనుగోలు చేయకూడదు. పోస్టర్లు & ప్రచారం విషయానికిస్తే ప్రభుత్వ ఆస్తులపై పోస్టర్లు, బ్యానర్లు వేయకూడదు. అనుమతి లేని హోర్డింగ్స్, ఫ్లెక్సీలు నిషేధంలో ఉంటాయి. సోషల్ మీడియా దుర్వినియోగం, తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే పోస్టులు చేయకూడదు.

KCR : కేసీఆర్ చుట్టూ దెయ్యాలు.. రెండోది ఎవరంటే?

రూల్స్ అతిక్రమిస్తే ఎలాంటి చర్యలుంటాయ్..

ఎవరైనా అభ్యర్థులు, అధికారులు కోడ్ ఉల్లంఘిస్తే వారికి ముందుగా నోటీసులు వెళ్తాయి.ఆ తర్వాత చర్యలు ఉంటాయి. మొదటిసారి చిన్న తప్పు అయితే ఎన్నికల కమిషన్ నోటీసు ఇస్తుంది.జరిమానా / కేసుతో సరిపెడుతుంది. తీవ్రమైన ఉల్లంఘనకు ఫైన్ లేదా క్రిమినల్ కేసు నమోదు అవుతుంది. అంతేకాకుండా, ప్రచారంపై నిషేధం విధిస్తుంది. అనగా అభ్యర్థి లేదా పార్టీపై ప్రచారం చేయకుండా నిషేధం విధించవచ్చు.అభ్యర్థిత్వం కూడా రద్దు కావొచ్చు. తీవ్రంగా ఉల్లంఘిస్తే నామినేషన్ రద్దు కూడా కావచ్చు. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగాలన్నదే కోడ్ ఉద్దేశ్యం. అందుకే కోడ్ అమల్లో ఉన్నంతకాలం ఎన్నికల కమిషన్ ఆదేశాలే ప్రభుత్వ అధికారులు, రాజకీయనాయకులు సైతం పాటించాల్సి ఉంటుంది.

 

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×