E-Paper
Advertisement

NIA: బ్యాంకుల్లో డబ్బు దాస్తున్న మావోయిస్టులు.. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు..

NIA: బ్యాంకుల్లో డబ్బు దాస్తున్న మావోయిస్టులు.. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు..
Advertisement

NIA: మావోయిస్టులు రూటు మార్చారా? డబ్బుల్ని డంపుల్లో కాకుండా బ్యాంక్ అకౌంట్లలోనూ, మ్యూచువల్ ఫండ్లలోనూ దాస్తున్నారా? అవుననే అంటోంది.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-NIA. జార్ఖండ్‌కు చెందిన ఓ కేసులో ఏకంగా 152 బ్యాంక్ అకౌంట్లతో పాటు.. 20 కోట్లకుపైగా డబ్బు ఉన్న ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఖాతాను అటాచ్ చేసింది. జార్ఖండ్‌లో వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేసిన NIA.. ఓ సంస్ధ, దాని భాగస్వాములు మావోయిస్టులతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నారని, వారికి నిధులు సమకూరుస్తున్నారని తేల్చింది.

2019లో జార్ఖండ్‌లోని లతేహార్‌లో పోలీసు వాహనంపై దాడి చేసిన మావోయిస్టులు.. నలుగురు పోలీసులను చంపి, వారి దగ్గరున్న ఆయుధాలను లూటీ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన NIA.. సంతోష్ కన్‌స్ట్రక్షన్ భాగస్వాముల్లో ఒకరైన మృత్యుంజయ్ కుమార్ సింగ్‌ను నిందితుడిగా గుర్తించి.. మావోయిస్టులతో అతని సంబంధాలపై ఆరా తీసింది. మావోయిస్ట్‌ ప్రాంతీయ కమిటీ సభ్యుడైన రవీంద్ర గంజాకు.. మృత్యుంజయ్ కుమార్ సింగ్ డబ్బు సమకూర్చినట్లు తేల్చింది.

Advertisement

లతేహర్‌లో పోలీస్ వాహనంపై రవీంద్ర గంజా నేతృత్వంలోని మావోయిస్టుల బృందం దాడి చేయడానికి ఒక రోజు ముందు కీలక పరిణామం జరిగింది. బీర్‌జంఘా అడవిలో మృత్యుంజయ్.. గంజాను కలుసుకున్నాడు. అతనికి 2 లక్షల రూపాయలు ఇచ్చాడని.. ఆ డబ్బుతోనే దాడికి గంజా ప్రణాళిక రూపొందించాడని ఎన్‌ఐఏ చెబుతోంది. మృత్యుంజయ్ ఇంటి నుంచి కూడా 2.5 లక్షల రూపాయలను NIA స్వాధీనం చేసుకుంది. మావోయిస్టుల పేరుతో డబ్బు వసూలు చేసి.. వాటిని బ్యాంక్ అకౌంట్లలోనూ, మ్యూచువల్ ఫండ్లలోనూ దాచిపెట్టి.. అవసరమైనప్పుడు మృత్యుంజయ్ మావోయిస్టులకు ఇస్తూ వస్తున్నాడని NIA నిర్ధారించింది. 152 బ్యాంక్ అకౌంట్లతో పాటు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఖాతాలో ఉన్న 20 కోట్ల రూపాయలకు పైగా నగదును అటాచ్ చేసింది.

Related News

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×