E-Paper
Advertisement

Patnam Mahender Reddy : కేబినెట్ లోకి పట్నం.. నేడు ప్రమాణస్వీకారం..

Patnam Mahender Reddy :  కేబినెట్ లోకి పట్నం.. నేడు ప్రమాణస్వీకారం..
Advertisement

Patnam Mahender Reddy : ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని మంత్రి పదవి వరించబోతోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారు. ఈ విషయాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి వెల్లడించారు. మహేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయడంతో ఒక స్థానం ఖాళీ అయ్యింది. అప్పటి నుంచి ఆయన స్థానంలో ఎవర్నీ తీసుకోలేదు. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. పట్నం మహేందర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన గత ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో ఓడిపోయారు. మహేందర్ రెడ్డిపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆ తర్వాత కారెక్కారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రెడ్డికే బీఆర్ఎస్ టిక్కెట్ దక్కింది.

Advertisement

మరోవైపు కొన్నిరోజుల క్రితం మహేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. ఆ వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం పట్నంతో చర్చలు జరిపింది. కారు దిగకుండా ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసింది. ఈ నేపథ్యంలో మహేందర్‌రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలని గులాబీ బాస్ కేసీఆర్‌ నిర్ణయించారు.

మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే ప్రభుత్వం నుంచి గవర్నర్‌ కార్యాలయానికి సమాచారం పంపారు. దీంతో మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణం చేయడానికి అవసరమైన ఏర్పాట్లను రాజ్‌భవన్‌ చేసింది. ఇప్పుడు పట్నంకు కేసీఆర్ ఏ శాఖను కేటాయిస్తారనే ఆసక్తి నెలకొంది.

Related News

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×