E-Paper
Advertisement

Russia : రష్యాలో విమాన ప్రమాదం.. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌ మృతి..?

Russia : రష్యాలో విమాన ప్రమాదం.. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌ మృతి..?
Advertisement

Russia : యెవ్ గనీ ప్రిగోజిన్.. కొంతకాలంగా ఈ పేరు రష్యాలోనేకాదు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యలో ప్రిగోజిన్ పాపులర్ అయ్యారు. రష్యా ప్రైవేట్ సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధినేతగా ఉన్నారు. ఇటీవల అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వెనక్కి తగ్గారు ప్రిగోజిన్‌. తాజాగా విమాన ప్రమాదంలో ఆయన మరణించారని సమాచారం.

ఓ ప్రైవేట్ జెట్‌ మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. విమానంలో ప్రయాణిస్తున్న 10 మంది వ్యక్తులు మరణించారు. ప్రయాణికుల జాబితాలో ప్రిగోజిన్‌ పేరు ఉందని తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన ఆ విమానంలో ప్రిగోజిన్ ఉన్నారో లేదో నిర్ధారణ కాలేదని రష్యా అత్యవసర విభాగం అధికారులు ప్రకటించారు. కూలి పోయిన జెట్ మాత్రం ప్రిగోజిన్‌దేనని నిర్ధారించారు.

Advertisement

మాస్కోకు ఉత్తరాన ఉన్న త్వేర్‌ రీజియన్‌లో ఎంబ్రాయర్‌ విమానం కూలిపోయిందని రష్యా విమానయాన సంస్థ రోసావియాత్సియా వెల్లడించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు.

ప్రిగోజిన్‌ ఉక్రెయిన్‌పై యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ప్రిగోజిన్ నేర చరిత్రతోనే పాపులర్ అయ్యారు.
1981లో దొంగతనం, దోపిడీ కేసుల్లో దోషిగా తేయారు. 12 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యాపారవేత్తగా మారారు.
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో రెస్టారెంట్ల నిర్వహించారు. రష్యా ప్రభుత్వ ఆహార కాంట్రాక్టులన్నీ ఆయన రెస్టారెంట్లకే దక్కాయి. ఈ సమయంలో రష్యా అధ్యక్షడు పుతిన్‌తో ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పుతిన్ కు బాగా దగ్గరై ముఖ్య అనుచరుడిగా ఎదిగారు. ప్రిగోజిన్ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

ఆర్థికంగా బలపడిన ప్రిగోజిన్ వాగ్నర్‌ ముఠా ఏర్పాటు చేశారు. ఈ‌ గ్రూపులో 90 శాతం మంది ఖైదీలే ఉన్నారని అమెరికా ఓ నివేదికలో పేర్కొంది. తీవ్ర నేరాలు చేసిన వ్యక్తులను తన బృందంలో చేర్చుకున్నారు. ప్రిగోజిన్‌ అగ్రరాజ్యాల వాంటెడ్‌ లిస్ట్ లోనూ ఉన్నారు.

గత జూన్‌లో పుతిన్‌పై వాగ్నర్‌ గ్రూప్ తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఒక్కరోజులోనే మళ్లీ వెనక్కి తగ్గింది. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ ప్రిగోజిన్ భేటీ అయ్యారు. ప్రిగోజిన్ కు బెలారస్‌లో ‌ ఆశ్రయం కల్పించారు పుతిన్. వాగ్నర్‌ గ్రూపు సభ్యులు రష్యా సైన్యంలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదం జరగడం అనేక అనుమానాలను కలిగిస్తోంది.

Tags

Related News

రిటైర్డ్ ఆర్మీ దంపతులకు షాక్.. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.61.85 లక్షలు స్వాహా!

కేవలం ప్రియుడి కోసం.. కవలలను చంపిన కసాయి తల్లి, రాజస్థాన్‌లో దారుణం

ఇన్‌ఫ్లుయెన్సర్ సూసైడ్.. వేధింపుల వెనుక ఏం జరిగింది? చెన్నైలో ఘటన

మోదీ సర్కార్‌ని కూల్చేందుకు కుట్ర.. దసరా వేళ భగవత్ హాట్ కామెంట్స్, పశ్చిమం నుంచి తుఫాను మొదలు

పెళ్లైన జంట.. భర్త ముందే భార్యపై 8 మంది, బీహార్‌లో షాకింగ్ ఘటన

యూకో బ్యాంక్‌లో జాబ్స్.. మొత్తం 530 ఉద్యోగ ఖాళీలు.. ఫ్రెషర్స్‌కు మంచి ఛాన్స్

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఏం జరిగింది.. పారిపోతున్న వ్యక్తిని పట్టేశారు, అసలు గుట్టు బయటకు

కొండ చిలువల తోక పట్టుకుని రీల్స్.. వైరల్ కావడానికి ఏమైనా చేస్తేస్తారా?

Big Stories

Advertisement
×