E-Paper
Advertisement

Pawan Kalyan | తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే జనసేన పోరాటం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan | తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఆంధ్ర ప్రదేశ్‌లో జనసేన పార్టీ గూండాలతో, రౌడీలతో పోరాటం సాగిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో రోడ్ షోలో పాల్గొన్నారు.

Pawan Kalyan | తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే జనసేన పోరాటం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan | తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఆంధ్ర ప్రదేశ్‌లో జనసేన పార్టీ గూండాలతో, రౌడీలతో పోరాటం సాగిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో రోడ్ షోలో పాల్గొన్నారు.

ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని చెప్పిన ప్రముఖ రచయిత దాశరథి కృష్ణమాచార్యులనే తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పారు. సనాతన ధర్మం, సోషలిజం రెండూ కలిపిన మార్గంలో నడవడమే జనసేన విధానం అని.. ‘ఇదే నా ఇజం.. హ్యూమనిజం’ అని పవన్ వ్యాఖ్యానించారు

బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న విషయం గుర్తు చేశారు. జనసేన, బీజేపీకి అండగా నిలబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను తెలంగాణలో ఉన్నా లేకపోయినా జనసైనికులు మాత్రం ఇక్కడ ఉంటారని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ నచ్చడంతో ఆయనకు మద్దతుగా ఉన్నానన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారని వారికి ప్రజలు అండగా ఉండాలని.. ఓటు వేసి గెలిపించాలని కోరారు.

నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా.. అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. అణగారిన ప్రజల కడుపు మండి పోరాడితే.. వారికి జనసేన, బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటాయని హామీ ఇచ్చారు.

సింగరేణిలో ఉద్యోగాలు రావాలన్నా.. పేపర్ లీక్స్ కాకుండా యువత బీజేపీతో రావాలన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞం పేరుతో నీటి దోపిడీ వల్లే తెలంగాణ పోరాటానికి పునాది పడిందని.. కౌలు రైతులు అసలు రైతులే కాదనడం చాలా తప్పు అని విమర్శించారు. ధరణిలో ఉన్న లోపాల వలన చాలా మంది నష్టపోయారని చెప్పారు. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్‌ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

.

.

.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×