E-Paper
Advertisement

Suriya : హీరో సూర్యకు ప్రమాదం.. ఆసుపత్రిలో చికిత్స

Suriya : హీరో సూర్యకు ప్రమాదం.. ఆసుపత్రిలో చికిత్స
Advertisement

Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు కంగువ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. సూర్య కెరీర్లో 42వ ప్రాజెక్ట్ గా వస్తున్న కంగువ చిత్రం షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ జరుగుతుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తుండగా..దిశా పటాని హీరోయిన్ గా చేస్తోంది. కోవై సరళ చాలాకాలం తర్వాత మళ్లీ ఈ మూవీలో కనిపించనుంది. అలాగే కమెడియన్ యోగిబాబు కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే థాయ్ లాండ్ లో షూటింగ్ పూర్తిచేసుకుని వచ్చిన టీమ్.. తాజాగా సినిమా ఫైనల్ షూటింగ్ ను చెన్నైలో ప్లాన్ చేసింది.

కంగువ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. భారీ యాక్షన్ సీన్స్ లో పాల్గొన్న సూర్యపైకి రోప్ కెమెరా వచ్చి పడింది. దాంతో సూర్య భుజానికి గాయమైంది. వెంటనే షూటింగ్ ఆపేసిన యూనిట్ సభ్యులు.. సూర్యను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సూర్య ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటుండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తు ఆయనకు భుజం గాయంతో పెద్ద ప్రమాదం తప్పిందని చిత్రయూనిట్ భావిస్తోంది. రోప్ కెమెరా తలపై పడి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని సూర్య అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా.. సూర్యకు ప్రమాదం జరిగినట్లు ఇంతవరకూ కంగువా టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×