BigTV English
Advertisement

Actor Brahmaji on AP Politics: ఛీఛీ.. ఏపీ రాజకీయాలు.. వాంతులు వచ్చేంత అసహ్యంగా ఉన్నాయి!

Actor Brahmaji on AP Politics: ఛీఛీ.. ఏపీ రాజకీయాలు.. వాంతులు వచ్చేంత అసహ్యంగా ఉన్నాయి!

Actor Brahmaji Sensational Comments on AP Politics 2024: నటుడు బ్రహ్మాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సింధూరం సినిమాలో హీరోగా నటించి మెప్పించిన ఆయన.. ఆ తరువాత విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇక ఎంత వయస్సు వచ్చినా ఇంకా యంగ్ లుక్ లో కనిపిస్తూ.. అసలు ఈయనకు వయస్సు పెరగదా..? అని అభిమానులకే అనుమానం తెప్పిస్తూ ఉంటాడు.


ఇక ఇవన్నీ పక్కన పెడితే బ్రహ్మాజీ కి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఎంత పెద్ద విషయమైనా చాలా ఈజీగా చెప్పేస్తాడు. అది కూడా మనసులో ఏది అనుకుంటే అది. ఇక సోషల్ మీడియాలో ఆయన ట్వీట్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏ విషయమైనా తనదైన శైలిలో మాట్లాడుతూ కౌంటర్లు వేస్తూ ఉంటాడు. తాజాగా బ్రహ్మాజీ ఏపీ ఎలక్షన్స్ పై సంచలనమైన ట్వీట్ చేశాడు. ఏపీ పాలిటిక్స్ చెత్తగా ఉన్నాయని అర్ధం వచ్చేలా మాట్లాడాడు.

“అసహ్యంగా ఉంది.. వాంతులు వచ్చేలా ఉన్నాయి. శ్రీ బూతు పురాణాలు” అంటూ ఏపీ ఎలక్షన్స్ 2024, ఆంధ్రా పాలిటిక్స్ ని ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే బ్రహ్మాజీ ఎవరి గురించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే గతంలో బ్రహ్మాజీ మెగా ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడి మినిస్టర్ రోజా వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.


Also Read: Fighting between Ysrcp vs Tdp cadre: కుప్పంలో దాడులు, పోలీసుల మొహరింపు, ఏం జరుగుతుందోనని..

జబర్దస్త్ ఆర్టిస్ట్ ల గురించి రోజా మాట్లాడిన వ్యాఖ్యలపై బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ” నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ campain చెయ్యమని కానీ, పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్ట్ లే కదా.. అంత భయపడతారెందుకు” అంటూ ట్వీట్ చేశాడు. దీన్ని బట్టి ఆయన జనసేనకే మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ బూతు పురాణాలు ఎవరిని ఉద్దేశించి బ్రహ్మాజీ అన్నాడో తెలియాల్సి ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×