BigTV English

CM Revanth Reddy Interview: రూ. 150తో హైదరాబాద్‌కు వచ్చా.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా..: సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy Interview: రూ. 150తో హైదరాబాద్‌కు వచ్చా.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా..: సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy Latest Interview: కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఇంకో పదేళ్లపాటు అధికారంలో ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తా అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నేను కేవలం ఒక్కడినే రూ. 150 తో నా సొంత ఊరు కొండారెడ్డిపల్లి నుంచి హైదరాబాద్ కు వచ్చా.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా. ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా నేను గెలిచినప్పుడు ఎవరైనా ఊహించారా నేను జెడ్పీటీసీని అవుతానని?. వీటన్నిటికీ కారణం శ్రమ, పట్టుదల, ప్రకృతి అనుకూలించడం, మీ అందరి సహకారం వల్లే సాధ్యమయ్యాయి. చరిత్ర ఎంత కాలముంటదో.. ఈ రాష్ట్ర మనుగడ ఎంత కాలముంటదో అంతకాలం నా పేరు గుర్తుంటది.. తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా, అలాగే కేసీఆర్ ను ఓడించిన వ్యక్తిగా నా పేరు చరిత్రలో శాశ్వతంగా ఉంటుంది.

వచ్చే పది సంవత్సరాల పాటు రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తా… నిరంతరం పరితపిస్తూనే ఉంటా.. అది నా బాధ్యత. భవిష్యత్ లో కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కృషి చేస్తా. పార్టీలో ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ ముందుకెళ్తా. పార్టీ కూడా కష్టపడ్డవారిని గుర్తిస్తుంది” అని ఆయన అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకరావడంలో కీలక పాత్ర పోషించాను కాబట్టే పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చింది’ అంటూ ఆయన పేర్కొన్నారు.


Also Read: Nearly 3 Crore Liquor Seized: ఎన్నికల వేళ మద్యం ప్రవాహం, పుష్ప ఫిల్మ్ మాదిరిగా, గోవా టు విజయవాడ

“నేను ఏ పని చేసినా చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పని చేస్తా.. ఎట్టి పరిస్థితుల్లో కూడా ‘ఏ.. అయితే అయ్యింది లేకపోతే లేదు’ అన్నట్టుగా ఎప్పుడూ కూడా ఆలోచించను.. నేను ఏది చేసినా ఎక్కువ ఫోకస్ పెట్టి పని చేస్తా.. అందుకే తక్కువ కాలంలో నాకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి” అని ఆయన అన్నారు. ఈ రాష్ట్రానికి వంద సంవత్సరాలకు అవసరమయ్యే అభివృద్ధి ప్రణాళికను ఆల్రడీ డిజైన్ చేశాను.. ఆ దిశగా ముందుకెళ్తూ అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు.

Also Read: కదిలివస్తున్న కృష్ణమ్మ.. కర్ణాటక నుంచి తెలంగాణకు నీరు విడుదల

సాధారణ వ్యక్తి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి తాను ఎదిగిన విధానం, అదేవిధంగా ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేదానిపై తనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ, ప్రణాళికలను, ఆ దిశగా వేస్తున్న అడుగుల విషయమై ఆ ఇంటర్ప్యూలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×