E-Paper
Advertisement

8 నెలల బేబీ కిడ్నాప్.. మూడు గంటల్లో చేధించిన పోలీసులు, అసలేం జరిగింది?

8 నెలల బేబీ కిడ్నాప్.. మూడు గంటల్లో చేధించిన పోలీసులు, అసలేం జరిగింది?
Advertisement

Hyderabad: కిడ్నాప్‌కు గురైన 8 నెలల చిన్నారిని కేవలం 3 గంటల్లో రక్షించారు హైదరాబాద్ పోలీసులు. ఆ బిడ్డను చూసిన తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంకా కాదు. అసలు బేబీ ఎలా కిడ్నాప్ అయ్యింది, చేయడానికి కారణమేంటి? దీని వెనుక ఏమైనా గ్యాంగులు ఉన్నాయా? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే…

 

హైదరాబాద్‌లో 8 నెలల బేబి కిడ్నాప్

Advertisement

హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు కొట్టె శివరామ్‌-స్పందన దంపతులు. వారికి వైష్ణవ్‌ రుద్రాంశ్‌ అనే కొడుకు ఉన్నాడు. ఈ దంపతుల ఇంట్లో వాచ్‌మేన్‌గా పని చేస్తోంది దుర్గాభవానీ అనే మహిళ. మరి ఏం జరిగిందో తెలీదుగానీ ఆ చిన్నారిని తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయింది సదరు మహిళ.

బాలుడి ఆచూకీ కనిపించలేదు. అటు పని మనిషి ఎక్కడా లేదు. దీంతో శివరామ్‌-స్పందన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి కోసం ఆరు బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారాన్ని అనుమానితురాలి కదలికలను పసిగట్టారు.

Advertisement

 

మూడు గంటల్లో చేధించిన పోలీసులు,  తల్లి ఒడికి చేరిన బేబి

కేవలం మూడు గంటల్లో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. సాంకేతికత ఆధారంగా బేబీ కర్మన్‌ఘాట్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సురక్షితంగా రక్షించారు. నిందితురాలు దుర్గాభవానీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

 

ఇదీ అసలు కథ

సీన్ కట్ చేస్తే.. నిందితురాలి వైపు నుంచి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన దుర్గాభవాని దంపతులు హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త పెయింటర్‌గా పని చేస్తున్నాడు.

డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది దుర్గాభవాని. పురిట్లో బిడ్డ చనిపోయిన విషయాన్ని భర్తకు చెప్పలేదు. కుమారుడితో పాటు హైదరాబాద్‌ వస్తానని ఆరు నెలలుగా భర్తను నమ్మించింది. కొడుకుని చూపించమని భర్త ఒత్తిడి తేవడంతో మానసిక వేదనకు గురైంది. దీంతో 8 నెలల బాబుని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

ALSO READ: మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!

 

Related News

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు.. కొత్తగా లక్ష రేషన్ కార్డులు, మరో వారంరోజుల్లో..

మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!

దౌల్తాబాద్‌లో షాకింగ్ ఘటన.. గడ్డి మందు పిచికారీతో 8 ఎకరాల వరి పంట ధ్వంసం!

ఇకపై పోలీస్, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ అన్నింటికీ ఒకే నంబర్.. ఏంటో తెలుసా..!

తుమ్మిడిహెట్టికి ‘ఎత్తు’ పెంచుతాం.. మహారాష్ట్రను ఒప్పించండి.. జల్‌శక్తి మంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

అప్పుడు ఏపీకి మద్దతిచ్చి.. ఇప్పుడు మొసలి కన్నీరా.. కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్!

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో కుండపోత వర్షం!

Big Stories

Advertisement
×