E-Paper
Advertisement

ఎల్లంపేటలో కుండపోత వర్షం.. చెరువులా తలపిస్తున్న ప్రధాన రహదారులు!

ఎల్లంపేటలో కుండపోత వర్షం.. చెరువులా తలపిస్తున్న ప్రధాన రహదారులు!
Advertisement

Yellampet Rain: ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు ఉదయం 10 గంటల సమయంలో కురిసిన వర్షంతో ముఖ్యంగా రావల్ కోల్–శివాజీ విగ్రహం ప్రాంతంలో రహదారులపై పెద్దఎత్తున నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆవేదన వ్యక్తం..

డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక రహదారులపై నిలిచిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్ల పరిసరాల్లోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి అవస్థలు ఎదురయ్యాయి.

ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి..

Advertisement

ప్రతి వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోతున్నా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ప్రధాన రహదారులు, కాలనీల్లో డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయడంతో పాటు వర్షపు నీరు సులభంగా వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. తక్షణమే అధికారులు స్పందించి రహదారులపై నిలిచిన నీటిని తొలగించాలని, భవిష్యత్తులో వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా శాశ్వత డ్రైనేజీ పరిష్కారం చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

Also read: జీహెచ్‌ఎంసీ రూటే సెపరేటు.. అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?

Tags

Related News

జీహెచ్‌ఎంసీ రూటే సెపరేటు.. అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?

జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థులకు ముప్పు? కేకే కమిటీకి టీఆర్‌ఎస్ సంచలన నివేదిక!

ఇవన్నీ మీ తాత ముత్తాతల ఆస్తులా కేటీఆర్?  అజీజ్ నగర్‌లో చామల రచ్చ!

ఖైరతాబాద్‌ సీటుకు బైపోల్ వస్తే.. తెరపైకి దానం కొత్త ఫార్ములా, నిర్ణయం ఎటు వైపు

సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో భారీ చోరీ.. విలువైన ఐఓఎస్ పరికరాలు మాయం!

ఖైరతాబాద్‌లో బిగ్ ట్విస్ట్.. దానంకు ఊహించని ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్!

కరీంనగర్‌లో దొంగల బీభత్సం.. ఒకేరోజు రెండు ఏటీఎమ్‌లలో భారీ చోరీ!

Big Stories

Advertisement
×