iPhone Productivity Hacks: ఐఫోన్ 17ను చాలామంది రీల్స్ చూడటానికి, ఫోటోలు తీయడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ ఇందులో మన రోజువారీ ఆఫీస్ పనులను మరింత ఈజీగా, వేగంగా చేసుకునే కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా Shortcuts, Focus Mode. వీటి కోసం ప్రత్యేకంగా యాప్స్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఐఫోన్‌లోనే ఉన్న ఈ రెండు ఫీచర్లను సెటప్ చేసుకుంటే.. మీ ఫోన్ ఒక పర్సనల్ ఆఫీస్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. మరి వీటితో ఏమేం చేయొచ్చో ఇప్పుడు చూసేద్దామా.
ఐఫోన్ 17లో ఉండే షార్ట్‌కట్స్ గురించి చాలా మందికి తెలియదు. ఇవి ఎలాంటి కోడింగ్ అవసరం లేకుండా మన పనులను ఆటోమేట్ చేసుకునే టూల్స్. ఉదా: పీడీఎఫ్‌లను సేవ్ చేయడం, ఖర్చులను ట్రాక్ చేయడం, ఫైళ్లను వేరే ఫోల్డర్‌కు మార్చడం వంటి పనులను ఫైల్స్ యాప్ తెరవకుండానే ఒక్క క్లిక్‌తో చేయవచ్చు. అలాగే ఐఫోన్ 17 లోని యాక్షన్ బటన్‌కు ఈ షార్ట్‌కట్స్‌ను లింక్ చేసుకుంటే.. మనం రోజూ చేసే పనులన్నీ ఒకే మెనూ రూపంలో ప్రత్యక్షమవుతాయి. పని వేగం ఎంత పెరుగుతుందో మీకే అర్థమవుతుంది.
Also Read: వామ్మో.. ఫేస్ అన్‌లాక్ విషయంలో ఐఫోన్, ఆండ్రాయిడ్ మధ్య ఇంత తేడా ఉందా?
ఆఫీస్ పని అయిపోయిన తర్వాత కూడా ఈ-మెయిల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల మనసుకు ప్రశాంతత ఉండదు. అలా అని ఆఫీస్ వేళల్లో సోషల్ మీడియా నోటిఫికేషన్లు డిస్టర్బ్ చేస్తుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ఫోకస్ మోడ్ ఉంది. వర్క్, పర్సనల్ అంటూ వేర్వేరు ప్రొఫైల్స్ సెట్ చేసుకుని, ఏ సమయంలో ఏ యాప్స్ ఆన్‌లో ఉండాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఆఫీస్ టైమ్ అయిపోగానే వర్క్ యాప్స్ మాయమయ్యేలా లేదా ఇంటికి వెళ్లాక ఆఫీస్ మెయిల్స్ సౌండ్ రాకుండా సెట్ చేసుకోవడం చాలా ఈజీ.
ఫోకస్ మోడ్‌లో ఉన్న మరో పెద్ద అడ్వాంటేజ్ హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ మార్చుకోవడం. ఆఫీస్‌లో ఉన్నప్పుడు కేవలం ఆఫీస్ యాప్స్, కాలెండర్ మాత్రమే కనిపించేలా హోమ్ స్క్రీన్ సెట్ చేసుకోవచ్చు. అలాగే లొకేషన్ బేస్ చేసుకుని, ఆఫీస్ గేట్ లోపలికి అడుగుపెట్టగానే ఆటోమేటిక్‌గా ‘వర్క్ ఫోకస్’ ఆన్ అయ్యేలా స్మార్ట్ యాక్టివేషన్ వాడుకోవచ్చు. ఒకే ఫోన్‌లో రెండు సిమ్‌లు వాడేవారైతే.. ఏ నంబర్‌కు కాల్ రావాలి, ఏది సైలెంట్ కావాలనేది కూడా దీన్ని బట్టే కంట్రోల్ చేయవచ్చు.
బయట మార్కెట్లో ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి ఎన్నో పెయిడ్ యాప్స్ ఉంటాయి. వాటన్నింటికీ సబ్‌స్క్రిప్షన్ల రూపంలో వేల రూపాయలు తగలేస్తుంటాం. కానీ యాపిల్ తమ ఐఫోన్ 17లో ఇచ్చిన ఈ ఫ్రీ ఫీచర్లతో మన పనులన్నీ మరింత వేగంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. ఆఫీస్ పనిలో స్మార్ట్‌గా రాణించాలన్నా, ఇంటికి వెళ్లాక ప్రశాంతంగా గడపాలన్నా ఈ చిన్న ట్రిక్స్ ఇప్పుడే ట్రై చేయండి. మీ ఐఫోన్ వాడకం స్టైల్ పూర్తిగా మారిపోతుంది.
Also Read: వేడి నీళ్లలో ముంచినా చెక్కుచెదరదు.. హానర్ నుంచి అసాధారణ ఫీచర్లతో సరికొత్త ఫోన్!