IND Vs PAK : ప్రస్తుతం పాకిస్తాన్-ఇండియా మధ్య అగ్గి వేస్తే.. భగ్గుమన్నట్టు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ అంటేనే పహల్గామ్ బాధితులు, పలువురు అభిమానులు ఆడకూడదని చెప్పారు. మ్యాచ్ ఆడకుంటే.. పాకిస్తాన్ కి బెనిఫిట్ అవుతుందని.. మరికొందరూ చెప్పడం.. బీసీసీఐ కూడా మ్యాచ్ కి అనుమతి ఇచ్చింది. దీంతో లీగ్ దశలో ఒకసారి, సూపర్ 4 లో మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ రెండు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. అయినప్పటికీ పాకిస్తాన్ వివాదాలు సృష్టిస్తూనే ఉంది. క్రికెట్ లో తొలి మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదం, రెండో మ్యాచ్ లో ఓపెనర్ ఫర్హాన్ గన్ ఫైర్ సెలబ్రేషన్స్, మరోవైపు ఫఖర్ జమాన్ ఔట్, హారిస్ గ్రౌండ్ లో యుద్ధవిమానాల గురించి వివాదాలు సృష్టించారు. తాజాగా ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో కూడా ఇంకో వివాదం సృష్టించడం గమనార్హం.
Also Read : Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !
పాకిస్తాన్ మరోసారి కవ్వించే ప్రయత్నం చేసింది. శ్రీలంకలో జరిగిన ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో ఇండియాతో మ్యాచ్ లో పాకిస్తాన్ మహమ్మద్ అబ్దుల్లా గోల్ చేసి భారత యుద్ధవిమానాలు కూలిపోయినట్టు సంజ్ఞలు చేశాడు. శ్రీలంకలో SAFF U-17 ఛాంపియన్ షిప్ లో ఇండియాతో మ్యాచ్ లో పాక్ ప్లేయర్ మహ్మద్ అబ్దుల్లా గోల్ చేసి ఇలా వ్యవహరించాడు. 2019లో వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ పాకిస్తాన్ విచారణ చేసే సమయంలో టీ తాగే ఫొటో వైరల్ కావడంతో అలా యాక్ట్ చేస్తూ.. ట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ 3-2తో గెలిచింది. మ్యాచ్ ఏదైనా సరే విజయం ఇండియాదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు టీమిండియా ఆటగాళ్లు. అయితే పాకిస్తాన్ మాత్రం మ్యాచ్ గెలవకుండా ఇండియాను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ.. ఏదేదో వివాదాలు సృష్టించాలని పన్నాగాలు వేయడం విశేషం.
మరోవైపు పాకిస్తాన్ ఓపెనర్లు సాహిబ్ జాదా ఫర్హాన్, హారిస్ రవూఫ్ చూపించిన అగ్రెసివ్ సంజ్ఞలపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు. పహల్గామ్ దాడులు, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ సంబంధాలపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడతారు.“భారత క్రికెటర్లు ఎప్పుడూ తొందరపడరు. మేము ఎప్పుడూ అనవసరమైన మాటలు అనం. మేము ప్రశాంతంగా మా ఆట మేం ఆడుకుంటాం. కానీ మీరు ఏదైనా చెబితే మేము సమాధానం చెప్పలేమని అనుకోవద్దు. మీరు ఆస్ట్రేలియా వాళ్లు అయినా, పాకిస్తాన్ వాళ్లు అయినా సరే. మేము సమాధానం ఇస్తాం. బ్యాట్‌తో సమాధానం ఇస్తాం, నోటితో కూడా ఇస్తాం” అని పఠాన్ ఘాటుగా హెచ్చరించాడు.
PROOF FOR THE PEOPLE OF PAKISTAN 🎥
Thankfully match was broadcasted live, or our neighbours would have claimed victory here too! https://t.co/L3gcwMyDgq pic.twitter.com/Ln26PyaHWo
— The Khel India (@TheKhelIndia) September 22, 2025