Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు వాయుగండం పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి తోడు గురువారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ జంట అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా ఇవాళ, రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని ప్రత్యేకంగా హెచ్చరించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో కూడా ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా మరో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: కోల్‌కతాలో భారీ వర్షం.. ఐదుగురు మృతి!
ముఖ్యంగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఈ రోజు కూడా మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారులు చెబుతున్నారు. దీంతో నగర వాసీలు జాగ్రత్తగా ఉండాలని తొందరగా ఇళ్లలోకి చేరుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఉత్తర/ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా ఉత్తర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 4.5 కి మీ మధ్యలో కొనసాగుతున్న ద్రోణి
ఈనెల 25వ తేదీకి తూర్పు మధ్య… pic.twitter.com/4pgp1G3ZFt
— BIG TV Breaking News (@bigtvtelugu) September 23, 2025