BigTV English

Rishabh Shetty : కాంతార చావులు… హీరో రిషబ్‌ను కూడా వదల్లేదు… 4 సార్లు బతికిపోయాడు

Rishabh Shetty : కాంతార చావులు… హీరో రిషబ్‌ను కూడా వదల్లేదు… 4 సార్లు బతికిపోయాడు

Rishabh Shetty: కన్నడ నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న రిషబ్ శెట్టి కాంతార సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా, హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒక్క సినిమాతో అటు నటుడిగా, ఇటు దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈయన ఇప్పుడు ‘కాంతార చాప్టర్ వన్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా దేశవ్యాప్తంగా తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హోంభలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


సినిమా కాదు.. ఎమోషనల్ జర్నీ..

ఇదిలా ఉండగా సెప్టెంబర్ 22 సోమవారం రోజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రిషబ్ శెట్టి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా కాంతార సినిమా చూడాలి అంటే సిగరెట్టు, మందు సేవించకుండా సినిమాకి పవిత్రంగా రావాలి అని చెప్పి వైరల్ అవుతున్న పోస్టర్ పై స్పందించారు. ఆయన మాట్లాడుతూ..” కాంతార చిత్రం అనేది ఒక సినిమా కాదు.. ఇదొక ఎమోషనల్ జర్నీ. మొదటి భాగానికి రెండు సంవత్సరాలు.. ప్రీక్వెల్ కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డాము. ఈ ఐదు సంవత్సరాలలో నా కుటుంబాన్ని కూడా నేను సరిగ్గా చూసుకోలేదు.

4 సార్లు చావు అంచుల నుండి బయటపడ్డాను..


మా టీం కి గత మూడు నెలలుగా నిద్ర కూడా లేదు. ఎందుకంటే నిర్విరామంగా పని జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరు ఇది తమ సొంత మూవీ అన్నట్లుగానే కష్టపడ్డారు. చెప్పాలి అంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో దాదాపు నాలుగు సార్లు నేను చనిపోవాల్సిన వాడిని. కానీ ఆ దేవుడే నన్ను రక్షించాడు” అంటూ రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు మొత్తానికి అయితే తాను నమ్ముకున్న దేవుడే తనను చావు నుంచి తప్పించాడు అని రిషబ్ శెట్టి కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ విషయం విని అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

also read:Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Related News

Allu Arjun-Rajamouli: అల్లు అర్జున్‌-రాజమౌళి కాంబోలో భారీ ప్రాజెక్ట్‌.. వరల్డ్‌ సన్సేషన్‌ పక్కా!

Rahul Ravindran: ఓజీలో నేను నటించాను.. కానీ, ఎడిటింగ్ లో తీసేశారు..

Malaika Kapoor: అర్జున్ కు హాగ్ ఇచ్చిన మలైకా.. ఫైనల్ గా మీరు మీరు..

Rukmini Vasanth: జీవితాన్ని మార్చేసిన మూవీ.. ఇప్పటికైనా గట్టెక్కుతుందా?

RGV: పవన్, చిరంజీవి కాంబినేషన్లో మూవీ.. వర్మ ట్వీట్ వైరల్!

OG Movie: ఓజీ ప్రీమియర్ షోలు క్యాన్సిల్… చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చేలా ఉన్నారే

Kantara Chapter 1: సెన్సార్ పూర్తి చేసుకున్న కాంతార 2.. నిడివి ఎంత.. ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే?

Big Stories

×