Gold Rate: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక్క రోజుగా భారీగా పెరిగిపోయాయి. దీంతో పసిడి ప్రియులు భయందోలనకు గురవుతున్నారు. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,070 కాగా.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,330 వద్ద పలుకుతోంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,650 ఉండగా.. మంగళవారం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,200 వద్ద ఉంది. అంటే ఒక్కరోజుకు రూ.1,260 పెరిగింది.
రికార్డ్ బద్దలుకోడుతున్న బంగారం ధరలు..
అరే ఎంట్రా ఇది బంగారం ధరలు ఇలా దూసుకెళుతున్నాయి. ఒక్క రోజులో ఇంత పెరిగితే ఇంకా బంగారం పై ఎవరైన ఆశలు పెట్టుకుంటారా.. ముఖ్యంగా సామాన్య ప్రజలు అయితే వాటిని కొనాలి అనే ఆశ కూడా చంపేసుకున్నారు. ఏదో ఉన్నవాళ్లు అయినా కొనాలి అని అనుకునేలోపే ఇది రికార్డ్ స్థాయిలో పరుగులు పెడుతుంది. ముందుముందు బంగారం ధరలు ఇంకి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని బంగారు నిపుణులు చెబుతున్నారు.
బంగారం పెరుగుటకు అసలు కారణం..
ట్రంప్ విధించిన సుంకాల వల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాల్లో అనిశ్చితి, పెట్టుబడిదారులను సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లిస్తోంది. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,14,330 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,200 వద్ద పలుకుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,330 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,200 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,330 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,04,200 వద్ద కొనసాగుతుంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,04,950 వద్ద పలుకుతోంది.
Also Read: మరో అల్పపీడనం.. నాలుడు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరలు మాత్రమే కాదు.. సిల్వర్ ధరలు కూడా వాటికి పోటిగా పెరిగిపోతున్నాయి. సోమవాకం కేజీ సిల్వర్ ధర రూ. 1,48,000 కాగా మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ.1,49,000 వద్ద పలుకుతోంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజిపై రూ.1,000 పెరిగింది. అలాగే కలకత్త, ముంభై, ఢీల్లిలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,39,000 వద్ద కొనసాగుతోంది.