BigTV English

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9 Promo:బిగ్ బాస్.. వరల్డ్ రియాలిటీ షోగా పేరు సొంతం చేసుకున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారనడంలో సందేహం లేదు. భాషతో సంబంధం లేకుండా ప్రతి ప్రేక్షకుడి నుంచీ ఈ షోకి మంచి ఆదరణ లభిస్తోంది. అలా ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు తొమ్మిదవ సీజన్ కూడా ప్రారంభమైంది. అందులో భాగంగానే 9 మంది సెలబ్రిటీలు 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు.. మొదటి వారం శ్రష్టి వర్మ సెలబ్రిటీల నుండి ఎలిమినేట్ కాగా.. రెండవ వారం మర్యాద మనీష్ కామనర్ నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది.


16వ ఎపిసోడ్ కొత్త ప్రోమో రిలీజ్..

ప్రస్తుతం 13 మంది మాత్రమే హౌస్ లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ షో కి సంబంధించి 16వ ఎపిసోడ్ మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సరికొత్త లవ్ ట్రాక్ బయటపడింది. ఈ ప్రోమో కాస్త వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరికి ఇద్దరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రోమో ఎలా ఉంది? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

మరో లవ్ ట్రాక్ మొదలు..


తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. కామెడీ పండించే ప్రయత్నం చేశారు ఇమ్మానుయేల్. అందులో భాగంగానే ఆయన సుమన్ శెట్టి, పవన్ తో కలిసి.. మాకు కూడా ఒక అమ్మాయిని సెట్ చేయరా? మేము కూడా చూసుకుంటాము అంటూ పవన్ కామెంట్లు చేయడంతోనే.. అటు ఎదురుగా తనూజ, రీతు చౌదరి, ఫ్లోరా షైనీ ముగ్గురు నడుచుకుంటూ వస్తారు. అక్కడికి రాగానే తనూజ నమస్తే అని చెప్పగానే.. దానికి ఇమ్మానియేల్ మాట్లాడుతూ నేనేమీ వీడికి తండ్రిని కాదమ్మా అంటూ కౌంటర్ వేస్తాడు.

ఒక్కొక్కరికి ఇద్దరా?

తర్వాత సుమన్ శెట్టి – తనూజా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అలా పక్కకు వెళ్లి మాట్లాడుకోండి మీ ఫ్రెండ్స్ ని మేము చూసుకుంటాం అంటూ పవన్ చెప్పిన డైలాగ్ వైరల్ గా మారింది. అలా వీళ్ళిద్దరూ పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉండగా.. రే కెప్టెన్ రూమ్ లోకి తీసుకెళ్లేవు అంటూ ఇమ్మానుయేల్ మరోసారి కామెడీ చేసి నవ్వించారు. తర్వాత సుమన్ శెట్టి – తనూజా మధ్య లవ్ సింబల్స్ వేయడం.. తనూజాను సుమన్ శెట్టి ఎత్తుకొని తిప్పడం అన్నీ కూడా ప్రోమోలో చూడవచ్చు. ఇది కాస్త కామెడీగా అనిపించినా మరో కొత్త లవ్ ట్రాక్ మొదలైంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే రీతూ చౌదరి డెమోన్ పవన్ ,సోల్జర్ కళ్యాణ్ లతో లవ్ ట్రాక్ నడుపుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు మొన్నటి వరకు ఇమ్మానుయేల్ తో లవ్ ట్రాక్ చూపించిన తనూజ ఇప్పుడు మళ్ళీ సుమన్ శెట్టితో లవ్ ట్రాక్ అనేసరికి ఒక్కొక్కరు ఇద్దరితోనా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇదంతా కామెడీలో భాగంగానే అని చెప్పవచ్చు.

also read:Rukmini Vasanth: జీవితాన్ని మార్చేసిన మూవీ.. ఇప్పటికైనా గట్టెక్కుతుందా?

 

Related News

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Bigg Boss 9: ఎన్టీఆర్ షోలో మర్యాద మనీష్.. గుండు సీక్రెట్ రివీల్ చేస్తూ!

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Big Stories

×