Amazon Flipkart Iphones| అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్… ఇవి రెండూ మొబైల్ ఫోన్స్, హోమ్ అప్లయన్సెస్ కొనుగోలుపై డబ్బు ఆదా చేయడానికి గొప్ప అవకాశాలు. అయితే 2025 స్పెషల్ సేల్స్‌లో ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌లపై రూ. 55,000 వరకు భారీ తగ్గింపు లభిస్తోంది. టెక్నాలజీ ప్రియులకు ఐఫోన్ 15, ఐఫోన్ 16 సిరీస్‌పై అద్భుతమైన డీల్స్ ఈ సేల్స్ అందుపాటుల ఉన్నాయి. ఈ సేల్స్ సెప్టెంబర్ 23, 2023 నుంచి ప్రారంభమవుతాయి. బ్యాంక్ ఆఫర్‌లతో మరింత తగ్గింపు పొందవచ్చు. కొత్త ఫోన్‌కి అప్‌గ్రేడ్ చేయడానికి ఈ ఫెస్టివల్ సీజన్ సరైన సమయం.
సేల్ తేదీలు, ముందస్తు యాక్సెస్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెప్టెంబర్ 23, 2023 నుంచి ప్రారంభమవుతుంది, అదే రోజు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కూడా ప్రారంభమవుతుంది, అమెజాన్ లో ప్రైమ్ సభ్యులకు, ఫ్లిప్ కార్ట్ లో ప్లస్, బ్లాక్ సభ్యులకు సెప్టెంబర్ 22 అర్ధరాత్రి నుంచి యాక్సెస్ ఉంటుంది. బెస్ట్ డీల్స్ ఉన్న మోడల్స్ త్వరగా సేల్ అవుతాయి. కాబట్టి ధరలను పోల్చి ఉత్తమ డీల్స్ ఎంచుకోండి.
అమెజాన్‌లో ఐఫోన్ 15 డీల్స్ బెస్ట్
ఐఫోన్ 15 ధర రూ. 69,900 కానీ రూ. 22,901 తగ్గింపుతో రూ. 46,999కే అమెజాన్ ఆఫర్ లో లభిస్తోంది. A16 బయోనిక్ చిప్‌తో స్మూత్ పనితీరు ఉంటుంది, మొదటిసారి ఐఫోన్ కొనేవారికి ఇది గొప్ప ఆప్షన్. బ్యాంక్ ఆఫర్‌లతో మరింత తగ్గింపు పొందవచ్చు. 6.1-అంగుళాల డిస్‌ప్లే బ్రైట్ నెస్ ఉంటుంది, రోజువారీ ఉపయోగానికి అద్భుతంగా సరిపోతుంది. ఐఫోన్ 15 లోని డ్యూయల్ కెమెరాలలో మంచి క్వాలిటీ ఫొటోలు తీయడానికి ఉపయోగపడతాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ఆఫర్
ఐఫోన్ 16 అసలు ధర రూ. 79,900. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 51,999కే అందుబాటులో ఉంది. అంటే ఏకంగా రూ. 27,901 డిస్కౌంట్. ఇందులోని A18 ప్రాసెసర్ భారీ వర్క్‌లోడ్‌లను సులభంగా నిర్వహిస్తుంది. 48 MP మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా-వైడ్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ మరింత సీన్‌ను క్యాప్చర్ చేస్తుంది. 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. ట్రేడ్-ఇన్ ఆఫర్‌లతో మరింత ఆదా చేయవచ్చు.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ డీల్
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర రూ. 89,900, ఇది రూ. 1,44,900 నుంచి రూ. 55,000 తగ్గింపు. A18 ప్రో చిప్, 8GB RAMతో పవర్ ఫుల్ పనితీరు అందిస్తుంది. 6.9-అంగుళాల ProMotion OLED స్క్రీన్ యూజర్ కి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. 48MP ట్రిపుల్ కెమెరాలు అద్వితీయంగా పనిచేస్తాయి. 4,685mAh బ్యాటరీ ఎక్కువ సమయం పనిచేస్తుంది. IP68 రేటెడ్ వాటర్‌ప్రూఫ్ ఫీచర్ ఉంది.
ఐఫోన్ 16 ప్రో డీల్
ఐఫోన్ 16 ప్రో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 69,900కి లభిస్తోంది. దీని అసలు ధర రూ. 1,19,900. అంటే రూ. 50,000 భారీ తగ్గింపు. ఇందులో.. A18 ప్రో చిప్, 6.3-అంగుళాల 120Hz డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సిస్టమ్, టైటానియం ఫ్రేమ్‌తో యూజర్ కు ప్రీమియం ఫీల్ ఇస్తుంది. నో-కాస్ట్ EMIతో పేమెంట్ సులభంగా చెల్లించవచ్చు.
అదనపు ప్రయోజనాలు
SBI లేదా ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌తో 10% తక్షణ తగ్గింపు, ICICI కార్డ్‌తో 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీ వద్ద ఉన్న పాత ఫోన్ ఎక్స్చేంజ్‌తో అధిక విలువ పొందవచ్చు. నో-కాస్ట్ EMIతో నెలవారీ చెల్లింపులు సులభం. ఫ్లాష్ సేల్స్‌లో స్టాక్ త్వరగా అయిపోతుంది. కాబట్టి త్వరగా ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి.
ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌లు ఇంత తక్కువ ధరలో మళ్లీ లభించకపోవచ్చు. లేదా మళ్లీ పెద్ద సేల్ కోసం వేచి చూడాల్సిందే. కాబట్టి త్వరపడండి.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే