Robbery In Khammam: ఖమ్మంలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. ఒక్క రోజులోనే ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడటం.. స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. తాళాలు పగలగొట్టి విలువైన బంగారు ఆభరణాలు, నగదు కొన్ని ఇతర వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఒకే రాత్రి ఆరు ఇళ్లలో చోరీ
వైఎస్ఆర్ కాలనీలో సోమవారం రాత్రి దొంగల ముఠా హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సీసీకెమరాలో రికార్డు అయింది. ఒకే సమయంలో అనేక ఇళ్లను టార్గెట్ చేయడం, తాళాలు పగలగొట్టడం, లోపలికి ప్రవేశించి విలువైన ఆభరణాలు, నగదు తీసుకెళ్లడం వారు ముందే ప్రణాళిక వేసుకున్నట్లు స్పష్టమవుతోంది.
కాలనీవాసుల్లో ఆందోళన
ఒకే రాత్రి వరుసగా ఇన్ని ఇళ్లలో చోరీలు జరగడం.. స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
పోలీసుల చర్య
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్నిఫర్ డాగ్స్, ఫింగర్ ప్రింట్ నిపుణులను తీసుకువచ్చి ఆధారాలను సేకరిస్తున్నారు. దొంగలు ఎలాంటి వాహనాలు వాడారు, ఎటువంటి మార్గాల ద్వారా వెళ్లారు అనే దానిపై సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు.
ప్రజల ఆవేదన
ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యం వహించకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని వారు అంటున్నారు. త్వరగా దొంగలను పట్టుకుని.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు సజీవ సమాధి
భద్రతా చర్యలపై ఆలోచన
ఈ సంఘటన తర్వాత కాలనీలో భద్రతా చర్యలపై చర్చ మొదలైంది. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, వాచ్‌మన్ ఏర్పాటు చేయాలని, కాలనీలోని ప్రతి వీధిలో వీధి దీపాలను సరిచేయాలని ప్రజలు నిర్ణయించుకుంటున్నారు.
దొంగల బీభత్సం.. సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు
ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ కాలనీలో దొంగల బెడద
ఒకే రోజు ఆరు ఇళ్లల్లో చొరబడి విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు pic.twitter.com/ZSs0qyTWr0
— BIG TV Breaking News (@bigtvtelugu) September 23, 2025