Vijayawada News: రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు.. ఏ రూపంలో జరుగుతాయో చెప్పలేము. మనం జాగ్రత్తగా వెళ్లినా.. అటువైపు నుంచి వచ్చేవారు జాగ్రత్తగా రావాలి. దీనికితోడు ఈ మధ్యకాలంలో గుండెపోటు ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న సమయంలో ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్‌కు సడన్‌గా గుండెపోటు వచ్చింది. నియంత్రణ కోల్పోయిన డ్రైవర్, ఓ బైక్ ని ఢీకొట్టి డివైడర్‌పైకి దూసుకెళ్లింది మినీ బస్సు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
విజయవాడ సిటీలో ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు పాఠశాలలను నిర్వహిస్తోంది. మంగళవారం ఉదయం ఆ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు వివిధ ప్రాంతాల్లో విద్యార్థులను ఎక్కించుకుంది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ఇంకేముంది స్టీరింగ్‌పై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.
దీంతో పాఠశాల బస్సు అటు ఇటు వెళ్తూ తొలుత ఓ బైకర్‌ని ఢీ కొట్టింది. ఆ తర్వాత ఎదురుగా ఉన్న డివైడర్‌ని ఢీ కొట్టింది. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు డ్యూటీ నిర్వహిస్తున్నారు. వెంటనే బస్సు దగ్గరికి వెళ్లి చూడగా డ్రైవర్ సృహ తప్పాడు. డ్రైవర్‌కు CPR చేశారు పోలీసులు, స్థానికులు. సమీపంలోని ఆసుపత్రికి డ్రైవర్‌ని తరలించారు.
ఘటన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా సురక్షింగా బయటపడ్డారు. డ్రైవర్ వల్ల తాము క్షేమంగా బయటపడ్డామని అంటున్నారు. బైకర్‌కి తీవ్రగాయాలయ్యాయి. అతడ్ని ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి విజయవాడలో మంగళవారం పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.
ALSO READ: మండలిలో అధికార-విపక్షాల మధ్య డైలాగ్స్ వార్
పాఠశాల బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు హడలిపోయారు. వెంటనే పాఠశాలకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిన విషయం తెలియగానే ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థులకు సేఫ్‌గా ఉండడంతో స్కూల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఇటీవలకాలంలో గుండెపోటు ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. డాక్టర్లు సైతం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.
స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్ కి గుండెపోటు
డ్రైవర్ కు గుండెపోటు రావడంతో అదుపుతప్పి ఓ ద్విచక్ర వాహనదారుడిని, డివైడర్‌ని ఢీకొట్టిన బస్సు
సకాలంలో ట్రాఫిక్ పోలీసులు స్పందించడంతో తప్పిన ప్రమాదం
డ్రైవర్ కు CPR చేసి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
డ్రైవర్ కి గుండెపోటు వచ్చిన సమయంలో… pic.twitter.com/K9fMHj6Ra2
— BIG TV Breaking News (@bigtvtelugu) September 23, 2025