Priyanka Gandhi latest speech: పోడు పట్టాలు ఇవ్వకుండా కేసీఆర్ ఆదివాసీలను మోసం చేశారు : ప్రియాంక గాంధీ

Priyanka Gandhi speech: పోడు పట్టాలు ఇవ్వకుండా కేసీఆర్ ఆదివాసీలను మోసం చేశారు : ప్రియాంక గాంధీ

Share this post with your friends

Priyanka Gandhi latest speech

Priyanka Gandhi latest speech(TS politics):

అదివాసీలు, గిరిజనుల అభివృద్థి కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఖానాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసగించారు. ఈ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గిరిజనులు, ఆదివాసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని.. అదే విధంగా గిరిజనుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.

ఇందిరాగాంధీ రాజకీయాలు కేవలం ప్రజల సంక్షేమం కోసమే చేశారని.. అందుకే ఎప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ప్రియాంక వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ 40 ఏళ్ల మరణించినా.. ఆమెను ప్రజలు ఇప్పటికీ గుర్తుకు చేసుకుంటున్నారని అన్నారు. అలాగే సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్ తెలంగాణలో నిరంకుశ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. పోడు పట్టాల ఇవ్వకుండా కేసీఆర్ ఆదివాసీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పదేళ్లుగా కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నా.. ప్రజలు ఇంకా వెనుకబడే ఉన్నరని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల జీవితాలు మారుతాయని.. ఉద్యమకారులు ఎన్నో కలలు కన్నారు కానీ అటువంటిదేమీ జరగలేదని విమర్శించారు. తెలంగాణ యువతకు కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా… వారి జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. అదే కేసీఆర్ కుటుంబంలో మాత్రం నలుగరికి ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికలలో గెలిస్తే.. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీలో వైఫల్యం వల్ల ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

జాబ్ కావాలంటే ముందు బీఆర్ఎస్ పోవాలని.. కేసీఆర్ ఫ్యామిలీ ఉద్యోగాలను పీకేయాలని ఆమె అన్నారు. ఎన్నికల్లో యువత ఆ పని చేస్తే నిరుద్యోగులకు తప్పకుండా కొలువులొస్తాయని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

.

.

.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Raghunandan Rao : కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిపై స్పందించిన రఘునందన్ రావు

Bigtv Digital

Vande Bharat Train : తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ రైలు.. ప్రారంభం ఎప్పుడంటే..?

Bigtv Digital

Secunderabad Station: కొత్తకొత్తగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. అంతా హైటెక్ లుక్..

Bigtv Digital

ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. భారత్ -పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

Bigtv Digital

Tillu Square second single : టిల్లు స్క్వేర్ సెకండ్ సింగిల్.. రాధిక రింగుల జుట్టుకు టిల్లు ఫిదా..

Bigtv Digital

Jagguswamy : హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్.. ఆ నోటీసులపై స్టే ఇవ్వాలని వినతి..

BigTv Desk

Leave a Comment