
Mancherial : ఆనాడు అభిమానం, ఈనాడు ఆగ్రహం.. అప్పట్లో గుడి కట్టి విగ్రహం, ఇప్పడు తిట్ల దండకం. అవును ఒకప్పుడు తనంటే ఎనలేని అభిమానం. అందుకే పాలరాతితో గుడికట్టి తన అభిమానాన్ని చాటిన వ్యక్తే.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆ విగ్రహాన్నే అమ్మేస్తానని బేరానికి పెట్టాడు.
మంచిర్యాల జిల్లా దండేపల్లిలో కేసీఆర్ వీరాభిమాని నిప్పులు చెరుగుతున్నాడు. తెలంగాణ ఉద్యమకారుడు ఒకప్పుడు తన ఇంటి వద్ద పాలరాతితో గుడికట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు గుండ రవీందర్. అయితే,.. సీఎంగా కేసీఆర్ ప్రజలను పట్టించుకోవడం లేదని.. తనకు కష్టమొచ్చిందని ప్రగతి భవన్ వరకు వెళ్లినా ఎలాంటి స్పందన లేదని మండిపడుతున్నాడు. తెలంగాణ ఉద్యమం కోసం రెండెకరాలు భూమిని అమ్ముకుని నష్టపోయాయని.. కేబుల్ పేరుతో తనను ఇబ్బందులు పెడుతున్నా ఆ గోడు వినడానికి దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే కేసీఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెడ్తూ అందుకు సంబంధించిన ఫ్లెక్సీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ అంశం చర్చకు దారి తీసింది.
KA Paul : ఎన్నికల కమిషన్‌పై మండిపడిన కేఏ పాల్