
World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్ లో టాస్ ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. మొదటి ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతొ తొలుత భారత్ బ్యాటింగ్ కు దిగింది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. సెమీస్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. హార్థిక్ పాండ్యా గాయపడిన తర్వాత నుంచి సెమీస్ వరకు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఫైనల్ లో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అశ్విన్ ను ఆడిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ జట్టు మేనేజ్ మెంట్ విన్నింగ్ కాంబినేషన్ ను మార్చే సాహసం చేయలేదు.
రోహిత్ శర్మ ( కెప్టెన్ ), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లతో టీమిండియా బరిలోకి దిగింది.
ఆస్ట్రేలియా కూడా సెమీస్ ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిషెల్ మార్ష్, స్టివ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, జోష్ ఇంగ్లీష్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్ ), ఆడమ్ జంపా, జోష్ హేజల్ వుడ్ లతో ఆసీస్ బరిలోకి దిగింది.
Pawan: ప్రాణభయంతో వైసీపీ ఎమ్మెల్యేలు.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తా: పవన్ కల్యాణ్