E-Paper
Advertisement

Rahul Gandhi : అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలి.. రాహుల్ ఆదేశం..

Rahul Gandhi : అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలి.. రాహుల్  ఆదేశం..
Advertisement

Rahul Gandhi : అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ జూమ్ సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా అనుసరించాలని వ్యూహాలపై నేతలతో చర్చించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాలు దాటి రావద్దని అభ్యర్థులకు ఏఐసీసీ ఆదేశించింది. ఏఐసీసీ పరిశీలకులు కూడా తమకు కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని స్పష్టం చేసింది.

తొలుత కాంగ్రెస్ అభ్యర్థులను హైదరాబాద్ రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. అయితే ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుంది. హైదరాబాద్ రావద్దని కాంగ్రెస్ అభ్యర్థులకు పీసీసీ నేతలు సమాచారం ఇచ్చారు. రాత్రి హైదరాబాద్‌ కు వచ్చి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాజ్ కృష్ణా హోటల్లో బస చేస్తారు. ఆదివారం తాజ్ కృష్ణా హోటల్ నుంచే ఆయన కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తారు. ఉదయం మరికొందరు ఏఐసీసీ నేతలు రాష్ట్రానికి వస్తారు.

Advertisement

మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రలోభపెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను కేసీఆర్‌ ప్రలోభపెడతారని తమకు తెలిసిందన్నారు. అందుకే
ముందు జాగ్రత్త చర్యగా పార్టీ అభ్యర్థులకు కొన్ని సూచనలు చేసి అప్రమత్తం చేశామన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×