BigTV English

Ankit Tiwari bribe | లంచం తీసుకుంటూ పోలిసులకు చిక్కిన ఈడీ అధికారి!

ED official bribe | లంచం తీసుకుంటూ ఒక ఈడీ(ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారి పోలిసులకు చిక్కాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టేసేందుకు లంచం డబ్బును తీసుకుంటున్న సమయంలో పోలిసులు అతడిని పట్టుకున్నారు.

Ankit Tiwari bribe | లంచం తీసుకుంటూ పోలిసులకు చిక్కిన ఈడీ అధికారి!

Ankit Tiwari bribe | లంచం తీసుకుంటూ ఒక ఈడీ(ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారి పోలిసులకు చిక్కాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టేసేందుకు లంచం డబ్బును తీసుకుంటున్న సమయంలో పోలిసులు అతడిని పట్టుకున్నారు.


అంకిత్ తివారీ అనే ఈడీ అధికారి తమిళనాడు దిండిగల్ ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్ నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆర్థిక నేరాలు, అవినీతి అరికట్టడం కోసం ప్రభుత్వం ఏర్పటు చేసిన ప్రత్యేక విభాగం ఈడీ(ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్). అలాంటి విభాగంలో పనిచేసే ఉద్యోగి అవినీతిపరుడిగా అరెస్టు కావడంతో దేశమంతా కలకలం రేపింది.

పట్టుబడిన ఈడీ అధికారి అంకిత్‌ తివారి గతంలో ఇలాగే పలువురి వద్ద లంచం తీసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే అంకిత్‌ అరెస్ట్‌ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే అంకిత్‌ను ఈ కేసులో ఇరికించారని కొందరు ప్రచారం కూడా చేస్తున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండిగల్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్‌పై నమోదైన కేసులో అక్టోబర్ 29న ఈడీ అధికారి అంకిత్ తివారీ సంప్రదించాడు. ఈ కేసుపై విచారణ జరపాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని డాక్టర్‌కి తెలిపాడు.

అక్టోబరు 30న మధురైలోని ఈడీ కార్యాలయంలో ముందు హాజరు కావాలని సదరు డాక్టర్‌ని తివారీ కోరాడు. ఆ డాక్టర్ మధురై వెళ్లినప్పుడు, చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.3 కోట్లు లంచం చెల్లించాలని తివారీ అడిగాడు. అనంతరం బేరసారాలు జరిపి లంచం రూ.51 లక్షలకు తగ్గించాడు.

అలా నవంబర్ 1న మొదటి విడతగా తివారి డాక్టర్ నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మిగిలిన రూ.51 లక్షలు వెంటనే చెల్లించాలని, లేదా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించేవాడు. వాట్సాప్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా తివారీ డాక్టర్‌ని బెదిరించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో నవంబర్ 30న ఆ డాక్టర్ డిండిగల్ విజిలెన్స్ యూనిట్‌లో తివారిపై ఫిర్యాదు చేశాడు. తమిళనాడు పోలీసులు చేసిన ప్రాథమిక దర్యాప్తులో ఈడీ అధికారిగా అంకిత్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని తేలింది.

డిసెంబర్ 1న డాక్టర్ నుంచి రెండో విడతగా మరో రూ.20 లక్షలు లంచం తివారీ తీసుకుంటున్న సమయంలో విజిలెన్స్ అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×