Rain in Telangana including Hyderabad : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతుంది. హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతినగర్, సంగారెడ్డి, కూకటపల్లి, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మైత్రివనం, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, చార్మినార్, కొండాపూర్, గడ్చిబౌలితోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో నగరం మరోసారి తడిసిముద్దయ్యింది. వర్షం కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు సమాచారం. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యిందో… అక్కడ క్లియర్ చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. వికారాబాద్ తోపాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తున్నట్లు సమాచారం.
Also Read: కేటీఆర్ పరువు నష్టం దావా కేసు.. విచారణ.. తాజా అప్ డేట్ ఇదే
ఇదిలా ఉంటే.. వాతావరణ శాఖ తాజాగా కీలక సూచన చేసింది. వర్షానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. రానున్న మూడు రోజులూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని సూచనలు చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.
ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, ములుగు, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశమున్నదని తెలిపింది. అదేవిధంగా రేపు, ఎల్లుండి ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నిర్మల్, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది.
వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఓ చక్రవాతపు ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గాలులు వీస్తున్నాయి. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి ఈ గాలులు వీస్తున్నాయి.
Also Read: నాడు ఏమయ్యారు.. నేడు వచ్చేశారు.. కేటీఆర్ కు ఊహించని షాకిచ్చిన ప్రజాసంఘాలు
వర్షాల నేపథ్యంలో రానున్న మూడు రోజులు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాల పట్ల ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటూ అలర్ట్ గా ఉండాలని పేర్కొంటున్నారు.