Ipl 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} ప్రపంచంలో ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఆటగాళ్ల మార్పిడి, వేలం పాటలో కొత్త ఆటగాళ్ల రాక, జట్ల వ్యూహాలు.. ఇలా ప్రతి సీజన్ కొత్త అనుభూతులను అందిస్తుంది. అయితే 2026 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఓ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాని కావ్య మారన్ 2026 ఐపీఎల్ కోసం ఓ పెద్ద స్కెచ్ వేసినట్లు ఓ వార్త వైరల్ గా మారింది.
Also Read: APL 2025: APL-2025 విజేతగా తుంగభద్ర వారియర్స్… పుష్ప రేంజ్ లో సెలబ్రేషన్స్… ప్రైజ్ మనీ ఎంత అంటే
నిజానికి 2025 ఐపీఎల్ మెగా వేళానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్.. హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమీన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి ని రిటైన్ చేసుకుంది. ఇక 2025 మెగా వేలంలో మరో 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 45 కోట్ల తక్కువ మొత్తంతో వేలంలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. ఆటగాళ్ళ ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ని 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ని పది కోట్లు, హర్షల్ పటేల్ కోసం 8 కోట్లు, సిమర్జిత్ సింగ్ 1.5 కోట్లు, జయదేవ్ ఉన్నద్గట్ 1 కోటి, ఇంగ్లాండ్ పేసర్ బ్రైడెన్ కార్సే ను కోటి రూపాయలకు సొంతం చేసుకుంది.
అలాగే రాహుల్ చాహర్ 3.20 కోట్లు, ఆడం జంపా 2.40 కోట్లు, జీషన్ అన్సారి 40 లక్షలు, అభినవ్ మనోహర్ కోసం 3.20 కోట్లు, ఇషాన్ మలింగ 1.20 కోట్లు, కామిందు మెండిస్ 75 లక్షలు, అధర్వ టైడే 30 లక్షలు, అనికేత్ వర్మ 30 లక్షలు, సచిన్ బేబీ 30 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే 2024 ఐపీఎల్ లో రన్నరప్ గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. 2025 ఐపీఎల్ లో మాత్రం గ్రూప్ స్టేజ్ కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో 2026 ఐపీఎల్ కోసం ఎస్ఆర్హెచ్ యాజమాని కావ్య.. ఏకంగా నలుగురు కీలక ప్లేయర్లపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Watch Video: పాపం ట్రాఫిక్ పోలీస్.. క్రికెట్ ఆడలేక.. బ్యాట్ అడుక్కుని మరీ… వీడియో వైరల్
ఈ నలుగురు ప్లేయర్లలో మొహమ్మద్ షమీ కూడా ఉండడం విశేషం. ఐపీఎల్ 2026 కి ముందు ఈ నలుగురు ఆటగాళ్లను విడుదల చేయాలని యాజమాన్యం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్, అభినవ్ మనోహర్ ఉన్నారు. ఈ నలుగురు ప్లేయర్స్ ని గత సీజన్ లో 31.65 కోట్లకు కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. వీరిని విడుదల చేసి.. 2026 ఐపీఎల్ కి ముందు ఈ 31 కోట్లతో ఇతర ఆటగాలను కొనుగోలు చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం తెలిసిన ఎస్ఆర్హెచ్ అభిమానులు.. ఇంతటి కీలక ఆటగాళ్లను వదులుకోవద్దని కొంతమంది క్రీడాభిమానులు కామెంట్స్ చేస్తుంటే.. వీరిని రిలీజ్ చేసి కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లను తీసుకోవాలని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.