BigTV English

BRS Leader KTR: నాడు ఏమయ్యారు.. నేడు వచ్చేశారు.. కేటీఆర్ కు ఊహించని షాకిచ్చిన ప్రజాసంఘాలు

BRS Leader KTR: నాడు ఏమయ్యారు.. నేడు వచ్చేశారు.. కేటీఆర్ కు ఊహించని షాకిచ్చిన ప్రజాసంఘాలు

BRS Leader KTR: మీ పాలనలో మీరేం చేశారు.. అప్పుడు లేని ఆప్యాయత, అనురాగాలు ఇప్పుడెందుకు గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు మారుమ్రోగాయి. ఇలా నిరసన ఎదుర్కొన్న పరిస్థితిలో కేటీఆర్ సోమవారం మాజీ ప్రొఫెసర్ సాయిబాబా పార్థీవ దేహానికి నివాళులర్పించారు.


ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ని నాగ్‌పూర్‌ కేంద్ర కారాగారంలో ఉంచారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో దాదాపు తొమ్మిదేళ్లపాటు జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడంతో నాగ్‌పూర్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

కాగా ఇప్పటి బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ గా ఉండి తెలంగాణ విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చింది. నాడు సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేసినా.. ప్రభుత్వం నుండి తగిన సహకారం అందలేన్నది సాయిబాబా వర్గం వాదన. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై నినదించేందుకు కూడా సంఘాలకు అవకాశం కల్పించలేదని కూడా ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాయిబాబా అరెస్ట్ సమయంలో నాడు అధికారం ఉండి కూడా.. నిరసన తెలిపేందుకు ఎటువంటి అవకాశం ఇవ్వకపోగా.. ప్రజాస సంఘాలకు మద్దతు ఇవ్వకపోవడంతో నాడు బీఆర్ఎస్ పై వ్యతిరేక పవనాలు వీచాయి. దాని ఫలితమే నేడు మాజీ మంత్రి కేటీఆర్ కు నిరసన ఎదుర్కోవాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.


కాగా మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మృతి చెందగా.. పలువురు నివాళులర్పించారు. పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు సంతాపం వ్యక్తం చేసి, ఆయన మృతదేహాన్ని సందర్శించారు. ఇలా కేటీఆర్ కూడా అక్కడికి చేరుకోగా.. కేటీఆర్ గో బ్యాక్ కేటీఆర్ అంటూ కామ్రేడ్స్ నినాదాలు చేశారు. పదేళ్లు సాయిబాబా జైలులో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందని వారు నినాదాలు చేశారు. నాడు ఏమి చేయక నేడు నివాళి అర్పించడానికి ఎలా వస్తారంటూ ఆందోళన తెలిపారు. అయితే కేటీఆర్ మాత్రం.. సైలెంట్ గా సాయిబాబా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Also Read: Watch Video: మంటల్లో కాలుతున్న కారు జనాల మీదికి దూసుకొస్తే, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

ఇప్పుడు అధికారంలో లేకున్నా.. కేటీఆర్ కు నిరసన సెగ తాకడం విశేషం కాగా.. కేటీఆర్ కూడా సైలెంట్ గా అక్కడినుండి వెనుతిరిగారు. ఇక సాయిబాబా భౌతికకాయాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు బందోబస్తు చేపట్టారు. అలాగే సాయిబాబా మృతిపట్ల పలువురు మేధావులు సంతాపం వ్యక్తం చేయగా, కళాకారులు పాటల రూపంలో సాయిబాబా జీవిత చరిత్రను ఆలపిస్తున్నారు.

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×