Film industry:సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా వరుస విషాదాలు అందరిని ఉలిక్కిపాటుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా గుండెపోటు.. ఇది వింటే చాలు అందరి గుండెల్లో గుబులే అని చెప్పాలి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలను మొదలుకొని పండు ముసలి వాళ్ళ వరకు చాలామంది ఈ గుండెపోటు బారిన పడి స్వర్గస్తులవుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు రావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ గుండెపోటు కారణంగా మనిషి ప్రాణం పోవడం ఒక ఎత్తు అయితే.. ఆ వ్యక్తి పైన ఆధారపడిన కుటుంబాలు నిరాశ్రయులవడం మరో ఎత్తు. అందుకే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎప్పటికప్పుడు వైద్యులు హెచ్చరిస్తూనే ఉంటారు.
సినీ ఇండస్ట్రీలో విషాదం..
ఇదిలా ఉండగా ఇప్పుడు ఏకంగా సినిమా షూటింగ్ సెట్లో ఈ గుండెపోటు బారిన పడి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన ప్రాణాలను కోల్పోయారు. ఆయన మరణంతో సినీ యూనిట్ మొత్తం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది ? ఎప్పుడు జరిగింది? ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ హాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ డియోగో బోరెల్లా (Diego borella).. సినిమా షూటింగ్ స్పాట్ లోనే ఆయన గుండెపోటుతో కన్నుమూశారు..
గుండెపోటుతో హాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి..
ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ రూపొందిస్తున్న ‘ఎమిలీ ఇన్ పారిస్’ వెబ్ సిరీస్ ఐదో సీజన్ కి డియోగో బోరెల్లా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరీస్ షూటింగ్ ఇటలీలోని వెనిస్ నగరంలో జరుగుతోంది. ఈ ఘటన ఆగస్టు 21 గురువారం సాయంత్రం జరిగింది. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా.. ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోవడంతో సెట్ లోని సిబ్బంది ఆయనను వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. గుండెపోటుతో అక్కడికక్కడే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
శోకసంద్రంలో ఇండస్ట్రీ..
అసిస్టెంట్ డైరెక్టర్ మృతితో షూటింగ్ ను నిలిపివేశారు. ఇకపోతే ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18వ తేదీన నెట్ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈయన మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా గుండెపోటుతో అసిస్టెంట్ డైరెక్టర్ మరణించడం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు అటు అభిమానులను ఇటు సినీ సెలబ్రిటీలను, బాధిత కుటుంబాలను మరింత బాధిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు.