Singapore: రీల్ వ్యవహారాలు.. రియల్ లైఫ్‌లో కనిపిస్తున్నాయి. ఆ తరహా సన్నివేశాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వ్యవహారం ఒకటి సింగపూర్‌లో వెలుగు చూసింది. రెండో భార్య ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చాడు ఆమె భర్త. దీంతో భర్త సెకండ్ సెటప్ వ్యవహారం బయటపడింది. ఇద్దరు మహిళలను మోసం చేయడం, ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించిన ఆ భారతీయుడికి సింగపూర్ స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఇండియాకు చెందిన 49 ఏళ్ల వైద్యలింగం ముత్తుకుమార్ 2007లో సింగపూర్ మహిళతో వివాహం జరిగింది. ఆ మహిళకు భారత్‌లో వివాహం ఘనంగా జరిగింది. పెళ్లయిన నాలుగేళ్లకు అంటే 2011లో సింగపూర్‌లో ఉన్న భార్య దగ్గరకు వెళ్లాడు ఆమె భర్త ముత్తుకుమార్. అదే సమయంలో అనుకోకుండా మరో సింగపూర్ మహిళ సల్మా బీ అబ్దుల్ రజాక్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.
ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. తనకు పిల్లలు కావాలని లేకుంటే భార్యకు విడాకులు ఇస్తానంటూ సల్మాను నమ్మించాడు ముత్తు. ఇదివరకే ముత్తుకుమార్‌కు పెళ్లయిందని తెలిసింది. అయినా అతడ్ని వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. మూడేళ్ల కిందట అంటే 2022 ఆగస్టులో ముత్తుకుమార్-సల్మాలు ముస్లిం సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్‌కి వెళ్లిపోయాడు.
అక్కడి నుంచి ‘ఆయనకి ఇద్దరు’ సినిమాను ఫాలో అయ్యాడు ముత్తుకుమార్. ఓ వైపు ఫస్ట్ భార్యతో సంసారం చేస్తూనే.. సీక్రెట్‌గా రెండో భార్యను కలిసేవారు. ఆ విధంగా మేనేజ్ చేశాడు. అదే సమయంలో సల్మా గర్భవతి అయ్యింది. రెండేళ్ల కిందట సెప్టెంబర్ 14న డెలివరీ కోసం సింగపూర్‌లో మహిళా-శిశు ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది.
ALSO READ: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. అలాగైతే గ్రీన్‌కార్డు కష్టమే
అదే ఆసుపత్రిలో ముత్తుకుమార్ మొదటి భార్య నర్సుగా పని చేస్తోంది. రెండో భార్యకు బాబు పుట్టాడు. ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న ముత్తుకుమార్‌ను తొలి భార్య చూసింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముత్తును నిలదీసింది. అప్పుడు అతగాడి సెకండ్ సెటప్ వెలుగులోకి వచ్చింది.
గతేడాది జూన్ 12న పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకుంటూ తనకు ఎలాంటి వివాహాలు లేవని ముత్తుకుమార్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రెండో భార్య సల్మా, భర్త గురించి అధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసు అధికారులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముత్తుకుమార్‌కు ఇద్దరు భార్యలు ఉన్నట్లు తేలింది.
ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రకరకాల అభియోగాలపై కేసు నమోదు చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో సింగపూర్ స్థానిక కోర్టు ముత్తుకు మూడు నెలల మూడు వారాల జైలు శిక్ష విధించింది. ముత్తుకుమార్ ఇద్దరు భార్యలను మోసం చేశాడని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకటించారు.
మొదటి భార్యను రెండవ వివాహం గురించి చెప్పకుండా రహస్యంగా ఉంచాడని న్యాయస్థానికి తెలిపింది. ముత్తుకుమార్ మొదటి భార్యకు విడాకులు ఇస్తాడనే సాకుతో సల్మాను వివాహంలోకి నెట్టాడని భావించింది న్యాయస్థానం, ఈ మేరకు గురువారం తీర్పువెల్లడించింది. మొత్తానికి పుట్టీ పుట్టగానే బాలుడు తండ్రిని పట్టించాడని అంటున్నారు.